Peddireddy Ramachandra Reddy
Peddireddy Ramachandra Reddy: వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తరువాత అంతలా గుర్తింపు పొందారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ఈ రాష్ట్రానికి సీఎంగా జగన్ వ్యవహరిస్తే.. రాయలసీమకు ముఖ్యమంత్రిగా పెద్దిరెడ్డి ఉండేవారు. తన కనుసైగతో పాలించేవారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం అయినా.. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం అయినా.. పెద్దిరెడ్డి చెప్పిందే వేదం, చేసింది చట్టం అన్నట్టు ఉండేది పరిస్థితి. రాయలసీమలోని నాలుగు జిల్లాలను శాసించారు ఆయన. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. వైసీపీని వ్యతిరేకించారు.అయితే పెద్దిరెడ్డి కుటుంబాన్ని క్షమించారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డిని, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిని,రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కుమారుడు మిధున్ రెడ్డిని గెలిపించారు. అయితే పార్టీకి ఓటమి ఎదురు కావడంతో.. వారికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ఎందుకు గెలిచామా అన్న బాధ వ్యక్తం అవుతోంది. ప్రత్యర్థుల రాజకీయ పతనాన్ని కోరుకుంటే..ప్రజలు వారి పతనాన్ని కోరుకున్నారు. కొద్దిపాటి ఓట్లతో గెలిపించినా.. వారి ఆధిపత్యానికి గండి కొట్టారు.
గత ఐదేళ్ల వైసిపి పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసించారు. అందుకే మంత్రివర్గ విస్తరణలో సైతం పెద్దిరెడ్డికి ప్రాతినిధ్యం దక్కింది. విస్తరణలో రెన్యువల్ లభించింది. ఇదే అదునుగా కుప్పం నుంచి చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించాలని చూశారు పెద్దిరెడ్డి. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. రాయలసీమ మనుషులను సైతం రంగంలోకి దించారు. అయితే వారొకటి తెలిస్తే.. ప్రజలు ఒకటి తలచినట్టు ఓటమి ఎదురైంది. వైసీపీకి దారుణ పరాజయం ఎదురయ్యింది.గెలిచినప్పుడు అంతులేని ఖ్యాతిని పొందిన ఆ కుటుంబం.. ఓటమితో నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. తాము గెలిచినా పార్టీ ఓడిపోవడంతో ఎక్కడా లేని ఇబ్బందికర పరిస్థితులను పెద్దిరెడ్డి కుటుంబం ఎదుర్కొంటోంది.
తన రాజకీయ పతనాన్ని పెద్దిరెడ్డి కోరుకున్నారు. అనుక్షణం తన గురించే ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి పై చంద్రబాబు దృష్టి పెట్టరా? దారుణంగా దెబ్బతీయరా? అంటే సహజంగానే దెబ్బ కొడతారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లారు. కానీ ఆ పర్యటన వెనుక ప్రత్యేక వ్యూహం ఉంది. చంద్రబాబు ఇలా వెళ్లి వచ్చారో లేదో పుంగనూరు మున్సిపాలిటీ అంతా పసుపు మయంగా మారింది. చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కార్యవర్గం అంతా వైసీపీకి రాజీనామా చేసింది. అసలు పుంగనూరు వచ్చి పెద్దిరెడ్డి సమీక్ష పెట్టే వీలు లేకుండా పోయింది. ఒక మాదిరి వైసీపీ నేతలు అంతా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పెద్దిరెడ్డి దురాగతాలను బయటపెడుతున్నారు. పార్టీ గెలిచినప్పుడు అంతా పెద్దిరెడ్డి హవా నడుచుకునేదని.. పేరుకే పదవులు తప్ప తమకు ఏ ప్రయోజనం లేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి అని తెలుసుకునే వీలు లేకుండా..పెద్దిరెడ్డి కుటుంబానికి అవకాశం పోయింది. అయితే ఇది ముమ్మాటికి పెద్దిరెడ్డి కుటుంబం స్వయంకృతాపమేనని తెలుస్తోంది.
పెద్దిరెడ్డి కి ఇప్పుడు చంద్రబాబు ఒక్కరే శత్రువు కాదు. రాయలసీమ వ్యాప్తంగా అందరూ శత్రువులే. సొంత సామాజిక వర్గం కూడా శత్రువే. చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబంతో ఆయనకు సుదీర్ఘ శత్రుత్వం ఉంది. చంద్రబాబుతో సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. పెద్దిరెడ్డి శత్రువు నల్లారి కుటుంబం చంద్రబాబుకు స్నేహ హస్తం అందించింది. ఆ రెండు కుటుంబాలకు సరైన సమయం చిక్కింది. అదే సమయంలో పెద్దిరెడ్డి కుటుంబానికి బ్యాక్ టైమ్ నడుస్తోంది. అందుకే ఇప్పుడు సొంత నియోజకవర్గం పుంగనూరులో అడుగుపెట్టి పరిస్థితి కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి లేకుండా పోయింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The fall of peddireddy ramachandra reddy has begun
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com