spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP MLC Elections: ఏపీలో మరో ఎన్నిక.. ఆ పార్టీది క్లీన్ స్వీప్

AP MLC Elections: ఏపీలో మరో ఎన్నిక.. ఆ పార్టీది క్లీన్ స్వీప్

AP MLC Elections: ఏపీలో మరో ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈనెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై రెండు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 3న స్క్రూట్నీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు జూలై 5. అదే నెల 12న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఆరోజు సాయంత్రమే ఫలితాలను వెల్లడిస్తారు.

ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్ టిడిపిలో చేరారు. దీంతో శాసనమండలి చైర్మన్ వారిపై అనర్హత వేటు వేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసిపి ఫిర్యాదు చేసింది. అందుకే వారిపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. ఆ రెండు స్థానాల భర్తీకి ఈసీ ఉపక్రమించింది. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. ఈ రెండు స్థానాలను సైతం ఏకపక్షంగా గెలుచుకునే ఛాన్స్ ఉంది. కనీస స్థాయిలో కూడా శాసనసభ్యులు లేకపోవడంతో వైసిపి పోటీ పెట్టే పరిస్థితి కనిపించడం లేదు.

కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు వైసిపి హై కమాండ్ ఎమ్మెల్సీ పదవి కేటాయించింది. ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. దక్కకపోయేసరికి టిడిపిలో చేరారు. అనర్హత వేటుకు గురయ్యారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఆయనకే ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి. మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ హిందూపురం నియోజకవర్గానికి చెందినవారు.గత ఎన్నికల్లో బాలకృష్ణ ఓడించేందుకు ఇక్బాల్ సేవలను వాడుకుంది వైసిపి. ఆయనకు ఏకంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఈ ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని చెప్పుకొచ్చింది. తీరా ఎన్నికలకు ముందు ఓ మహిళా అభ్యర్థిని బరిలో దించింది. దీంతో మనస్థాపానికి గురైన ఇక్బాల్ టిడిపిలో చేరారు. బాలకృష్ణ విజయానికి కృషి చేశారు. ఇప్పుడు ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? వేరొకరికి ఛాన్స్ ఇస్తారా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే...
National Flag Day

National Flag Day: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా.. ప్రేరణాత్మక ప్రయాణం!

National Flag Day: భారత జాతీయ జెండా కేవలం మూడు రంగుల వస్త్రం కాదు. అది మన స్వాతంత్య్ర సంగ్రామం ఆశలు, త్యాగాలు, ఐక్యత, భవిష్యత్తు కలలను ప్రతిబింబించే చిహ్నం. 1947 జూలై...
Pawan Kalyan

Pawan Kalyan: ప్రకాశం జిల్లాకు మహర్దశ.. దశాబ్దాల సమస్యని పరిష్కరించిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: దశాబ్దాలు గా ప్రకాశం జిల్లా వాసులు ఎదురుకుంటున్న సమస్యలకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎన్నో...
iQOO Z11 Lite 5G

iQOO Z11 Lite 5G: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి రానున్న కొత్త ఫోన్..

iQOO Z11 Lite 5G:  ప్రస్తుతం చాలా మంది ఫోన్ కొనే సమయంలో బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఎక్కువ మన్నిక గల బ్యాటరీ ఉన్న ఫోన్ ధరలు అధికంగా ఉంటున్నారు....
Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Oktelugu Epaper