Megha Job Mela : చదువు జ్ఞానాన్ని ఇస్తే.. బుద్ధి సంపదను ఇస్తుందని పెద్దవాళ్లు చెప్పే ఒక నీతి సామెత. చదువు వేరు.. బుద్ధి వేరు.. చదువు లేని వారు ఎంతో మంది తెలివితేటల (బుద్ధి)తో కోట్లాది మంది చదువుకునే వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇక చదువు ఉన్న వారు ‘నాకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలి’ అని గిరి గీసుకొని కూర్చొంటున్నారు. అయితే, పదో తరగతి, ఆ పైచదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా.. ఐదెంకెల వేతనాలు ఇచ్చే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అలాంటి నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం. ఏపీలో కూటమి (టీడీపీ) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతలో వృత్తి నైపుణ్యాలు పెంచుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యువత ఉపాదే ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద జిల్లాల వారీగా పదో తరగతి, ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అవకాశాలు కల్పిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గంలో ఈ నెల 22 (మంగళవారం) మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కర్నూల్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి పీ దీప్తి తెలిపారు.
ఈ మేళాలో ప్రముఖ కంపెనీలైన శ్రీరామ్ చిట్ ఫైనాన్స్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, అరబిందో ఫార్మా, ఫ్లిప్‌కార్ట్ వంటి బడా బడా కంపెనీల ప్రతినిదులు పాల్గొని ఉద్యోగార్థులకు అవకావం కల్పిస్తారు. దీని కోసం పదో తరగతి నుంచి బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీటెక్, ఎంబీఏ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న వారు పాల్గొనవచ్చు. 22వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుంది. మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. దీప్తి సూచించారు.
ఈ మేళాలో ఎంపికైన వారికి.. వారి స్థాయి, అర్హతను బట్టి జీతం రూ. 10వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటుందని.. మేళాకు వచ్చిన వారికి ఫుడ్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హత జీరాక్సులు, ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో రావాలని సూచించారు. ఫార్మల్ డ్రెస్ లో మాత్రమే రావాల్సి ఉంటుందని సూచనలు చేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివరాలకు +91 99637 37163లో సంప్రదించవచ్చని సూచించారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The ap government is providing job and employment opportunities to the unemployed youth by increasing vocational skills among the youth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com