Conspiring against Chandrababu: ఇటీవల జాతీయ మీడియా గతి తప్పుతోంది. రాష్ట్రాల్లో ఉండే రాజకీయ వైరాలను అడ్డం పెట్టుకొని జాతీయ మీడియా( National media) తెగ ఆడేసుకుంటుంది. ఇప్పుడు ఎన్డీటీవీ వ్యవహారం అలానే ఉంది. జాతీయస్థాయిలో వివాదాస్పదం అవుతోంది సదరు టీవీ ఛానల్ వ్యవహార శైలి. చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూను అనుచితంగా ఎడిట్ చేసి ఆయనపై ట్రోలింగ్ జరగడానికి కారణం అవుతోంది ఎన్డిటీవీ. కచ్చితంగా దీని వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎందుకో ఇటీవల తెలుగు రాజకీయాలపై నేషనల్ మీడియా ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. జాతీయ స్థాయిలో సైతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
తప్పిదాన్ని హైలెట్ చేస్తూ..
దావోస్ లో( davos ) ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు తన బృందంతో వెళ్లారు.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్డి టీవీ జర్నలిస్ట్ రాహుల్ కన్వాల్ కు సైతం ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చిన్నపాటి తప్పిదం దొర్లింది. చంద్రబాబు టంగ్ స్లిప్ కాగా వెంటనే దానిని సరి చేసుకున్నారు. దావోస్ లో జరిగిన పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన గురించి వివరించారు చంద్రబాబు. ఈ క్రమంలో పొరపాటున 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని పేర్కొన్నారు. ఆ మరుక్షణమే తమ తప్పును గమనించిన ఆయన 23 లక్షల ఉద్యోగాలని వెంటనే సరిదిద్దుకున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో ఇది స్పష్టంగా ఉంది. కానీ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్ లో మాత్రం ఆ భాగాన్ని కట్ చేసి వీడియోను అప్లోడ్ చేశారు.
అదే పనిగా వైసిపి..
అయితే ఎన్డి టీవీ( NDTV) ఈ ప్రయత్నం చేయగా.. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా దానిని హైలెట్ చేస్తోంది. దావోస్ పర్యటనలు ఏపీ సాధించిన ఘనతను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో నేషనల్ మీడియా గా ఉన్న ఎన్డి టీవీ వ్యవహరించిన తీరు మాత్రం విమర్శలకు గురిచేస్తోంది. వాస్తవాలను దాచి పెట్టి.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాటలను వక్రీకరించి.. ఆయనపై ట్రోలింగ్కు కుట్ర చేయడం ఎన్డిటీవీ పాటిస్తున్న ఘోరమైన విలువలకు నిదర్శనం అన్న విమర్శలు ఉన్నాయి. అయితే దావోస్ సదస్సులో ఎన్డి టీవీ జర్నలిస్ట్ రాహుల్ కన్వాల్ వ్యవహరించిన తీరు కూడా అలానే ఉంది. అయితే ఇప్పుడు ట్రోల్స్ చేస్తోంది వైసిపి. అందుకు కారణమైంది ఎన్డి టీవీ . అయితే సదరు చానల్ చంద్రబాబుకు క్షమాపణ చెబితే చాలా గౌరవంగా ఉంటుంది. లేకుంటే నేషనల్ మీడియా పలుచన కావడం ఖాయం.
సీఎం చంద్రబాబు మాటలకు ఉలిక్కిపడ్డ యాంకర్
18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. దాంతో 23 లక్షల కోట్లు జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్పడంతో, 23 లక్షల కోట్ల అని యాంకర్ అనడంతో.. 20 లక్షల కోట్ల+ అని చెప్పిన సీఎం చంద్రబాబు
Video Credits – NDTV (Used Only For News) pic.twitter.com/ct5zLrcBod
— greatandhra (@greatandhranews) January 22, 2026