Director V Samudra: యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రాజశేఖర్…తన కెరియర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను చేశాడు. ముఖ్యంగా అంకుశం లాంటి సినిమాతో స్టార్ హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలన్నింటితో ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వచ్చాడు. ఇక అలాంటి రాజశేఖర్ ఇప్పుడు తన కెరీర్ ని కోల్పోయి సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు…ఈ క్రమంలోనే రాజశేఖర్ తో ‘సింహరాశి’ అనే ఒక సూపర్ హిట్ సినిమాను చేసిన దర్శకుడు వి సముద్ర… రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ గురించి తన భార్య జీవిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు… సింహరాశి సక్సెస్ తర్వాత రాజశేఖర్ వి సముద్రతో మరో సినిమా చేయడానికి చాలా వరకు ప్రయత్నాలైతే చేశారట. కానీ రాజశేఖర్ చేస్తానన్న అన్ని సినిమాలు రీమేక్ లే కావడంతో తమిళ్, మలయాళం సినిమాల్లో ఒరిజినల్ వెర్షన్స్ ను రాజశేఖర్ చూసి వి సముద్ర కి పంపించేవాడట. కానీ వాటిలో ఏ సినిమా కూడా వి సముద్ర కి పెద్దగా నచ్చేది కాదట. ఒకానొక సమయంలో రాజశేఖర్ వి సముద్రం మీద చిరాకు పడి సముద్ర ఏది చెప్పిన ఏ సినిమా చూపించిన నచ్చలేదు అంటున్నాడు. బహుశా అతను కావాలనే అంటున్నాడేమో అనుకున్నాడట. కానీ మధ్యలో అతను వేరే దర్శకులతో ఆయా సినిమాలను రీమేక్ చేయించినప్పటికి అవి వర్కౌట్ కాకపోవడంతో వి సముద్ర జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందని మరొక మలయాళం సినిమాని పరుచూరి బ్రదర్స్ కి చూపించి దానిని సముద్ర కి రిఫర్ చేయమని చెప్పడంతో పరుచూరి గోపాలకృష్ణ సముద్ర కి కాల్ చేసి ఆ సినిమా చూడమని చెప్పాడట. అలాగే రాజశేఖర్ తో ఆ సినిమా చేయొచ్చు కదా అని చెప్పడంతో ఆ సినిమాని చూసి ఓకే అది వర్కౌట్ అవుతుందని సముద్ర చెప్పాడట. సముద్ర ఆ సినిమా వర్కౌట్ అవుతుంది మనం చేద్దామని చెప్పినందుకు రాజశేఖర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట.
ఇక ఆ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాల్లోని రైట్స్ ని కూడా తీసుకొని కొన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే ఈ మూవీ ఇంకా గ్రిప్పింగ్ ఉంటుందని చెప్పాడట. దాంతో ఒరిజినల్ కి 70% మార్పులు చేర్పులు చేసి ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకొచ్చారట. మొదటి నుంచి కూడా ఆ సినిమా సముద్ర మార్క్ తో కనిపించడంతో బాగా వస్తుందని ఎలాగైనా సరే ఈ సినిమాని మనం మనకు తగ్గట్టుగా వాడుకోవాలని రాజశేఖర్ జీవిత ప్రయత్నం చేశారట.అంతకు ముందే జీవిత రాజశేఖర్ తో కొన్ని సినిమాలు డైరెక్షన్ చేసి ప్లాప్ లను మూటగట్టుకున్నారు. దాంతో ఆమెకి డైరెక్టర్ గా మంచి పేరు లేదని ఈ సినిమా సక్సెస్ అవుతుంది.
కాబట్టి దీనికి డైరెక్టర్ గా మన పేరు వేసుకుంటే బాగుంటుందని జీవిత భావించిందట. ఇక అప్పటి నుంచి సముద్ర ఏది చేసినా కూడా రాజశేఖర్ సెట్లో పెద్దగా పట్టించుకునేవాడు కాదట. ఒకటికి రెండుసార్లు ఇది బాలేదు అది బాలేదు అని చెప్పి అతన్ని విసిగించే వాడట. దాంతో అసలు విషయం సముద్రకి అర్థమై అతను సెట్ నుంచి వెళ్ళిపోయాడట. మీ సినిమా మీరే చేసుకోండి అని చెప్పి ఆయన బయటికి వచ్చేయడంతో మధ్యలో కొంతమంది ఇన్వాల్వ్ అయి సముద్ర లేకపోతే మీకు సినిమా చేయడం కష్టమవుతుందని చెప్పారట.
దాంతో సముద్ర ను మళ్లీ పిలిపిండంతో ఆయన ‘ఎవడైతే నాకేంటి’ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేశారట. ఇక ఫైనల్ గా సముద్ర తో పాటు జీవిత పేరు కూడా వేయడం అనేది దారుణం…ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ సముద్ర చాలావరకు బాధపడ్డాడు… మొత్తానికైతే రాజశేఖర్ ఇలాంటి పనులు చేసి తన కెరియర్ ని తనే నాశనం చేసుకున్నాడు అంటూ సముద్ర ఇంటర్వ్యూ చూసిన చాలామంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…