Telangana AP Rice Transport Fraud: ఏపీలో( Andhra Pradesh) రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. నిత్యం ఏదో ఒక చోట రేషన్ బియ్యం పట్టుపడుతూనే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా కట్టడి చేసే ప్రయత్నం చేసింది. కానీ అడ్డుకట్ట పడడమే లేదు. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతుందన్న ఆరోపణలు నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకు తగ్గట్టుగానే భారీ షిప్ పై తరలిపోతున్న రేషన్ బియ్యం పట్టుబడింది. అప్పటినుంచి కాకినాడ పోర్ట్ పై ప్రత్యేక నిఘా ఉంది. అయితే ఆ పోర్టుపై రేషన్ బియ్యం తరలింపు ఆగిన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం రవాణా కొనసాగుతూనే ఉంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
* కట్టడి చర్యలు చేపట్టినా..
రేషన్ బియ్యం( ration rice) విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతూ వచ్చింది. తనిఖీలను ముమ్మరం చేసింది. అయినా సరే కట్టడి జరగడం లేదు. కొంతమంది మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై ఈ దందాకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. గ్రామాల్లో కమిషన్ ఏజెంట్లను నియమించుకొని.. ప్రజలు రేషన్ బియ్యం విడిపించిన వెంటనే ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అదే బియ్యాన్ని కమీషన్ ప్రాతిపదికన మిల్లర్లకు విక్రయిస్తున్నారు. అదే బియ్యం రీ పాలిష్ చేసి లెవీకి పంపుతున్నారు. అదే బియ్యాన్ని మళ్లీ రేషన్ బియ్యం గా మార్చేస్తున్నారు. ఈ దందా కొనసాగుతూనే ఉంది. అయితే తెలంగాణ బియ్యం ఏపీకి.. ఏపీ బియ్యం తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న బియ్యం నల్గొండ జిల్లాలో పట్టుబడింది.
* రూటు మార్చిన అక్రమార్కులు..
ఇప్పటివరకు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకున్నారు అక్రమార్కులు. కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి బియ్యం తీసుకొచ్చి చలామణి చేస్తున్నారు. సన్న బియ్యం పేరిట విక్రయాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వినియోగదారులు రేషన్ విడిపించిన వెంటనే వారి నుంచి 15 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేసినందుకు గాను మధ్య భక్తులకు మిల్లర్లు, వ్యాపారులు కిలో దగ్గర నాలుగు రూపాయలు అందిస్తున్నారు. అదే బియ్యాన్ని ఏపీలో 25 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే కిలో దగ్గర పది రూపాయలు దోపిడీ కొనసాగుతోందన్నమాట. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడడంతో అసలు విషయం బయటకు వచ్చింది. గత కొద్దిరోజులుగా ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడికక్కడే తనిఖీల ద్వారా ఈ రేషన్ బియ్యం రవాణా కు చెక్ పెట్టేందుకు రెండు రాష్ట్రాల అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. విస్తృత తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే బియ్యం రవాణా కట్టడికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగడం విశేషం.