Nara Lokesh: గత ఎన్నికల్లో ప్రజలను కులాలు, వర్గాలు, ప్రాంతాలుగా విభజించి వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందింది. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములాను అనుసరించి జగన్ అండ్ కో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కానీ వర్కవుట్ అయ్యే పరిస్థితులైతే లేవు. అటు ప్రజలు, ఇటు విపక్షాలు జాగ్రత్తపడుతున్నాయి. అధికార పార్టీ నేతల దురాగతాలను విపక్ష నేతలు ఎండగడుగుతున్నారు. నాటి ప్రయోగాలను బాగానే తిప్పికొడుతున్నారు. తనపై వ్యక్తిగత కామెంట్లు చేస్తూ వస్తున్నా గత మూడున్నరేళ్లుగా పవన్ సహనంతో ఓర్చుకున్నారు. వ్యక్తిగత కామెంట్లు వద్దని చాలా సందర్భాల్లో విన్నవిస్తూ వచ్చారు. కానీ వైసీపీ నాయకులు అదే పంథాను కొనసాగిస్తుండడంతో పవన్ తొలిసారిగా బరెస్ట్ అయ్యారు. చెప్పు చూపిస్తూ తనదైన రీతిలో హెచ్చరికలు జారీచేశారు. అయితే దీనిపై ఇప్పటివరకూ అసలు ఏపీలో తిట్లు, బూతులు, దాడులు, కేసులు, హెచ్చరికలు, వ్యక్తిగత విమర్శలే లేవన్న రీతిలో అధికార పార్టీ నేతలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. జగన్ అనుకూల మీడియా అయితే పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ వచ్చింది. అయితే ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి వారు సైతం లైట్ తీసుకున్నారు. అది భావోద్వేగంతో చేసిన కామెంట్స్ గానే మెజార్టీ ప్రజలు పరిగణిస్తున్నారు.

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి. వైసీపీ నేతలు కామెంట్స్ ను అదే రీతిలో కౌంటర్ ఇవ్వాలని పవన్ చేసి చూపించారు. దీంతో అదే పంథాను మిగతా నాయకులు కొనసాగిస్తున్నారు. తాజాగా టీడీపీ యువ నేత నారా లోకోష్ ట్విట్టర్ లో చెప్పుతో కొట్టండి అంటూ టీడీపీ శ్రేణులకు సూచించారు. తెలుగు అగ్రనేతలు చిరంజీవి, బాలక్రిష్ణ సినిమా టీజర్లు ఇటీవల విడుదలయ్యాయి. ప్రేక్షకులకు, అభిమానులకు కనువిందు చేశాయి. నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇద్దరి హీరోల సినిమాల మధ్య పోలిక పెడుతూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య బలహీనవర్గాల కథకు దగ్గరగా ఉందని..గతంలో ఇటువంటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు ఫెయిలయ్యాయని.. బాలక్రిష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి వంటి అగ్రవర్ణాల నేపథ్యం ఉన్న సినిమాలు హిట్ అయ్యాయని కామెంట్స్ పెడుతున్నారు. వాటినే ట్రోల్ చేస్తున్నారు. దీంతో అటు చిరంజీవి, ఇటు బాలక్రిష్ణ అభిమానుల మధ్య ఓ రకమైన కాంట్రివర్సి సిట్యువేషన్ ను క్రియేట్ చేస్తున్నారు.

అయితే ఇటీవల జనసేన, టీడీపీ మధ్య ఒకరకమైన సహృద్బావ వాతావరణం నెలకొంది. ఇటువంటి సమయంలో చిరంజీవి అభిమానులను రెచ్చగొట్టడం ద్వారా దానిని చెడగొట్టాలని రాజకీయంగా ప్లాన్ చేసినట్టుంది. వాస్తవానికి జనసేన, టీడీపీలు కలవడం అధికార పార్టీకి ఇష్టం లేదు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఆ రెండు పార్టీల మధ్య బంధం చెడిపోవడాలని పీకే ఐ ప్యాక్ బృందం చేస్తున్న ప్రచారంగా తెలుగు తమ్ముళ్లు అనుమానిస్తున్నారు. అందుకే దీనిపై లోకేష్ రంగంలోకి దిగారు. ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ఇది పీకే ఐ ప్యాంక్ గ్యాంగ్, పేటీఎం డాగ్స్ పనే’ అని ఆరోపించారు. జగన్ ప్యాలెస్ పిల్లి..చీప్ ట్రిక్స్ కుదరవు ఇక’ అంటూ హెచ్చరించారు. ఫేక్ అకౌంట్స్ ద్వారా కులం, మతం పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంచేసే వారిని చెప్పుతో కొట్టండి అంటూ లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ రేంజ్ లో లోకేష్ కూడా వైసీపీని ఉతికి ఆరేస్తుండడంపై టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.