Daggubati Rana: విలన్ పాత్రలు చేసి హీరో అయిన వారున్నారు.. హీరోగా నటించి ఆ తరువాత విలన్ పాత్రలు చేసినవారున్నారు.. కానీ ఓ వైపు హీరోగా..మరోవైపు విలన్ గా నటించి మల్టీపుల్ స్టార్ అనిపించుకుంటున్న ఒకే ఒక హీరో రానా. ‘లీడర్’గా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన రానా ఆ తరువాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశారు. ‘బాహుబలి’, ‘భీమ్లానాయక్’ వంటి పాత్రల్లో విలన్ గా మెప్పించారు. పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోసే రానాకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. లేటేస్టుగా రానా సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో ఆయన తండ్రి కాబోతున్న విషయం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అటు వెంకటేశ్ చిన్న కూతురు కూడా ప్రెగ్నెంట్ కావడంతో దగ్గుబాటి ఇంట్లో దీపావళికి డబుల్ ధమాకా అయినట్లయింది.

స్టార్ హీరో విక్టరి వెంకటేశ్ అన్న కొడుకు రానా. అయినా తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు రానా. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘లీడర్’తో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయనకు మొదటి సినిమాతోనే గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వరుసగా ‘కృష్ణం వందే జగద్గురుం’ వంటి సినిమాల్లో అవకాశం వచ్చింది. ఇలా కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో ‘బాహుబలి’ లో విలన్ పాత్ర కు ఒప్పుకోవడం విశేషం. ఇందులో హీరో ప్రభాస్ తో సమానంగా రానాకు గుర్తింపు వచ్చింది. అటు ఆరణ్యం లో హీరోగా నటిస్తూనే.. ఇటు ‘భీమ్లానాయక్ ’లో మరోసారి విలన్ గా నటించారు. ఇలా హీరోగా.. విలన్ గా మల్టీపుల్ నటుడిగా రానా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాబాయ్ వెంకటేశ్ తో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
ఇక ఆయన పర్సనల్ విషయాలకొస్తే రానా, మిహికాలు ప్రేమించుకున్నారు. వీరు 2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి అక్కినేని, మెగా ఫ్యామిలీ మాత్రమే హాజరైంది. అతికొద్ది మంది మధ్య రానా వివాహం ఘనంగా నిర్వహించారు. రానా, మిహికాలు పెళ్లికి ముందే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ప్రేక్షకులను అలరించేవారు. వీరికి సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునేవారు. అయితే కొంతకాలం రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇన్ స్ట్రాగ్రాంలోని తన ఫొటోలను డెలిట్ చేశారు.

దీంతో రానా, మిహికాలు విడిపోతున్నారని కొందరు ప్రచారం చేశారు. సమంత, చైతూ కపుల్స్ మాదిరిగానే రానా కపుల్స్ విడాకులు తీసుకుంటున్నారని అన్నారు. కానీ ఈ వార్తలకు రానా తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను తండ్రి కాబోతున్నట్లు మిహికాతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వారు విడిపోవడం లేదని తేల్చినట్లయింది. ఇక విక్టరి వెంకటేశ్ చిన్న కూతురు కూడా ప్రెగ్నెంట్ అని అంటున్నారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఇంట్లో ఈ దీపావళికి డబుల్ ధమాకా సంబరాలు చేసుకున్నారని అంటున్నారు.