https://oktelugu.com/

PK Survey: టిడిపి 50 సీట్లకు మించదు.. పీకే సర్వే సంచలనం..

ఏపీలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఎవరికి అధికారాన్ని కట్టబెట్టాలనుకుంటున్నారు? ఎవరు వస్తే తమ రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్నారు? అనే అంశాలపై ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 14, 2024 / 08:05 AM IST

    PK Survey

    Follow us on

    PK Survey: ఇవే చివరి ఎన్నికలు.. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా నేను ముఖ్యమంత్రిని కావాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ మళ్లీ బాగుపడాలంటే అది నాతోనే.. పలు సభలు, సమావేశాలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు. ఆయన చెబుతున్న మాటలను జనాలు విశ్వసించడం లేదు. ఈసారి కూడా ఆయనకు అధికారం ఇవ్వడం ఏపీ ప్రజలకు ఇష్టం లేదు.. మహా అయితే ఆయన జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల 50 సీట్లకు మించి ఎక్కువ సాధించలేరు.. ఇవేవో మేము చెబుతున్న మాటలు కాదు. అప్పట్లో చంద్రబాబు నాయుడుతో కలిసి భేటీ అయి పలు విషయాలు చర్చించిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.

    ఏపీలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఎవరికి అధికారాన్ని కట్టబెట్టాలనుకుంటున్నారు? ఎవరు వస్తే తమ రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్నారు? అనే అంశాలపై ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకోవడం లేదని.. ఇప్పుడున్న ప్రభుత్వం తమకు మంచి చేస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. జనసేన, బిజెపితో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టిడిపి.. 50 కి మించి సీట్లు గెలుచుకోదని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని.. చంద్రబాబు చెప్పే మాటలు ప్రజలకు ఎక్కడం లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. జనాల మనసును చురగొనాలి అంటే వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలని.. కానీ అది చంద్రబాబు నాయుడు కూటమికి చేతకావడం లేదని ప్రశాంత్ కిషోర్ బాంబు పేల్చారు.

    వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. తర్వాత ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా ప్లేట్ పిరాయించారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నప్పుడు టిడిపి, దాని అనుకూల మీడియా రచ్చ రచ్చ చేశాయి. ప్రశాంత్ కిషోర్ వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించాయి. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి వచ్చాడో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడి ని కలిశాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తున్నట్టు ఆయన పరోక్షంగా అంగీకరించారు. అయితే అప్పట్లో దీనిని సానుకూలమైన అంశంగా టిడిపి మీడియా రాసింది. ఇక వైసిపి మీడియా అయితే దీన్ని తప్పు పట్టింది. అయితే కొంతకాలం ప్రశాంత్ కిషోర్ పని చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుతో తేడా కొట్టినట్టు ఉంది. అందుకే ఆయన దూరం జరిగారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, జనసేన కూటమికి 50కి మించి సీట్లు రావాలి ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు వైసిపి శిబిరంలో ఆశలు చిగురింపజేయగా.. అటు టిడిపి శిబిరంలో ఆందోళన రేకెత్తించాయి. ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటల వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని టిడిపి ఆరోపిస్తుంటే.. క్షేత్రస్థాయి పరిశీలన ను ఆయన బయటపెట్టారని జగన్ అనుకూల మీడియా చెబుతోంది. ఇప్పటికైతే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. కానీ వాతావరణం మాత్రం వేడెక్కింది. త్వరలో ఏం జరుగుతుందో తెలియదు గానీ.. ఇప్పటికైతే నేతలు, రాజకీయ ఏజెన్సీలో పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. రాజకీయాలను రసకందాయంలో పడేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..