YS Jagan : జగన్ ఇంటి చుట్టూ రూ.15 కోట్లతో కంచె.. టిడిపికి అదో అస్త్రమే!

తెలుగుదేశం పార్టీ దూకుడుగా ఉంది. వైయస్ జగన్ ను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తోంది. రోజుకో ప్రచారాస్త్రంతో విరుచుకుపడుతోంది. తాజాగా జగన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెతో పెను దుమారమే రేపుతోంది.

Written By: Dharma, Updated On : October 16, 2024 6:24 pm

YS Jagan - Pattabhiram

Follow us on

YS Jagan :  జగన్ విషయంలో మరో సరికొత్త ఆస్త్రాన్ని బయటకు తీసిందితెలుగుదేశం పార్టీ. జగన్ విషయంలో వ్యూహాత్మకంగా టిడిపి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో జగన్ ఇరుకున పెడుతూ వస్తోంది టీడీపీ. తాజాగా ఆయన ఇంటి నిర్మాణ విషయాన్ని బయటకు తీసింది. ఆయన ఇంటికి సంబంధించి చుట్టూ కట్టిన ఇనుప కంచె విలువ 12 కోట్ల రూపాయలుగా తేల్చింది. అదంతా ప్రభుత్వ ధనంతోనే ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి నివాసాలకు సైతం అలాంటి కంచెను ఏర్పాటు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రజా సంఘాలను ఉక్కు పాదంతో అణచివేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముఖ్యమంత్రి నివాసం చుట్టూ భారీ భద్రత ఉండేది. కానీ దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేసిన జగన్ ఎన్నడూ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే అంశాన్ని బయటపెడుతోంది తెలుగుదేశం పార్టీ. కొద్దిరోజుల కిందట జగన్ నివాసం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై యూట్యూబ్ ఛానల్ లో సైతం ప్రత్యేక కథనాలు వచ్చాయి. గతంలో ఆ ప్రాంతంలో ఎవరికి ఎంట్రీ ఉండేది కాదు. తీవ్ర ఆంక్షలు పెట్టేవారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆంక్షలు ఎత్తివేయడంతో.. పలువురు యూట్యూబర్లు జగన్ నివాసం వద్ద ఉన్న పరిస్థితిని తెలియచెప్పే ప్రయత్నం చేశారు.

* లోకేష్ స్ట్రాంగ్ రియాక్షన్
అయితే తాజాగా దీనిపై స్పందించారు మంత్రి నారా లోకేష్. ప్రజాధనంతో జగన్ సర్కార్ జల్సాలు చేసిందని ఆరోపించారు. గత ఐదేళ్లుగా పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. జగన్ ఇంటికే కోట్లాది రూపాయలతో ఇనుప కంచెను వేశారని గుర్తు చేశారు. ప్రజలను అణచివేసే నియంతలే ఇలా ఇనుపకంచెలు వంటివి వేసుకుంటారని ఇది వచ్చేసారు లోకేష్. జగన్ హయాంలో విలాసాల పేరుతో కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు లోకేష్. ప్రస్తుతం లోకేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* బయట పెట్టిన పట్టాభి
అయితే ఈ విషయాన్ని ముందుగా బయట పెట్టింది మాత్రం టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. టిడిపి కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మరి జగన్ ఇంటి విషయాన్ని ప్రస్తావించారు. రుషికొండ ప్యాలెస్ లో బాత్ టబ్బులు, మసాజ్ టేబుల్ లు, కప్పు బోర్డులు, ప్రతి జిల్లాలోని వైసీపీ కార్యాలయాలు, తాడేపల్లి ప్యాలెస్లు.. ఇలా ప్రతిదీ విలాసమేనని గుర్తు చేశారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ దోచుకున్న సొమ్మంతా కక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని లోకేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జగన్ ఇంటి అంశం సరికొత్త అస్త్రం గా మారింది.