TDP Janasena Flag: కొందరి వ్యవహార శైలి అతిగా ఉంటుంది. ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. రాజకీయ పార్టీల అభిమానుల పరిస్థితి కూడా అదే. ఏపీ ఎన్నికల ఫలితాల( election results) తర్వాత ఒక ట్రెండ్ నడిచింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వెళ్లిన స్లోగన్.. చివరికి ఫలానా ఎమ్మెల్యే తాలూకా అంటూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు హల్చల్ చేసేదాకా పరిస్థితి వచ్చింది. రాజకీయేతర వేదికల వద్ద సైతం పార్టీల జెండాలతో కొందరు చేస్తున్న అతి అవమానాలకు గురవుతోంది. తాజాగా అటువంటిదే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. విదేశీ వేదిక వద్ద టిడిపి తో పాటు జనసేన జెండాను ఆవిష్కరించే ప్రయత్నం చేయగా.. అక్కడ అధికారులు అడ్డుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసినట్టే.. ప్లే ఆఫ్ చేరుకున్న టీమ్ లు ఇవే..
* గ్రాడ్యుయేషన్ దినోత్సవాల్లో..
తెలుగు రాష్ట్రాలకు( Telugu States) చెందిన చాలామంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు. పేరు మోసిన విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అయితే అక్కడ డిగ్రీల ప్రధానోత్సవం సమయంలో ఇక్కడ రాజకీయ పార్టీల జండాలను ఆ వేదికల వద్ద ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ జెండాలను తొలగిస్తున్నారు. టిడిపి తో పాటు జనసేన అభిమానులకు ఇలాగే షాక్ ఇచ్చారు అక్కడి అధికారులు. దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నాయి.
* అక్కడి అధికారుల అభ్యంతరాలు..
ఇటీవల ఓ విదేశీ యూనివర్సిటీలో( foreign university) గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఓ విద్యార్థి జనసేన జెండాను అక్కడ ఆవిష్కరించారు. కానీ అక్కడున్న ప్రొఫెసర్ అడ్డుకున్నారు. ఆ జెండాను లాక్కున్నట్లు ఆన్లైన్లో వీడియో వైరల్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. ఇదేం పిచ్చి అని ప్రశ్నిస్తున్నారు. మరో యూనివర్సిటీలో కూడా టిడిపి అభిమాని ఇలానే చేశారు. కానీ అక్కడ ఉన్న ప్రొఫెసర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వీడియోను సైతం జత చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. టిడిపి తో పాటు జనసేనకు విదేశీ గడ్డలో అవమానం అంటూ వైసిపి ప్రచారం చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది.
నిన్న టీడీపీ..
ఈరోజు జనసేన.. pic.twitter.com/WfRPXkyamh— Telugu Scribe (@TeluguScribe) May 18, 2025