Plan To Wake TDP Leader : తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) అంతర్గత పోరు పెరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో అది స్పష్టమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు ఒకరిని హత్య చేసేంతవరకు వెళ్లాయని ఆరోపణలు రావడంతో పార్టీ హై కమాండ్ సీరియస్ యాక్షన్ లోకి దిగింది. ఇప్పటికే ఒంగోలు, మాచర్లలో సొంత పార్టీ వారే నేతలను హతమార్చడం వంటి ఆరోపణలు వచ్చాయి. అందుకే అనంతపురం విషయంలో ప్రభుత్వంతో పాటు టిడిపి హై కమాండ్ అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు సొంత పార్టీ నేత సుధాకర్ నాయుడు ని హతమార్చేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
* పోలీసులు దృష్టి సారించడంతో..
ఎమ్మెల్యే అనుచరుల వ్యవహార శైలిపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. దీంతో అనంతపురం ఎస్పీ జగదీష్( SP Jagdish ) మెగాపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుధాకర్ నాయుడు హత్యకు కొందరు రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎస్పీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరులకు సుధాకర్ నాయుడు కి మధ్య విభేదాలు ఉన్నాయి. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజయం కోసం సుధాకర్ నాయుడు పనిచేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరి మధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయి.
Also Read : పట్టపగలు కిడ్నాప్ నా? సీమలో మళ్లీ మొదలైందా?
* నిఘా వర్గాల హెచ్చరికతో
పోలీస్ నిఘా వర్గాల ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. తెలుగుదేశం పార్టీ పరంగా సమస్యకు పరిష్కారం చూపించాలని భావించింది. దీనిపై నిజా నిజాలు తెలుసుకోవాలని పార్టీ అనంతపురం పరిశీలకుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర కు( kovila Mudi Ravindra) ఆదేశించింది. రెండు వర్గాలతో చర్చించి నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో చాలా నియోజకవర్గాల్లో విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న నేతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత క్యాడర్ను పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడే నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే చంద్రబాబు మహానాడు వేదికగా కీలక ప్రకటన చేశారు. పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో ఉండాలని కోరారు.
* టిడిపికి కంచుకోట..
అనంతపురం జిల్లా( Ananthapuram district ) టిడిపికి కంచుకోట. 2019 వైసీపీ ప్రభంజనంలో సైతం రెండు నియోజకవర్గాలను గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో రాయలసీమలో టిడిపి కి లభించిన సీట్లు 3. కుప్పం నుంచి చంద్రబాబు గెలిచారు. అనంతపురం జిల్లా నుంచి హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో అయితే పూర్తిగా స్వీప్ చేసింది టిడిపి కూటమి. గత అనుభవాల దృష్ట్యా అక్కడ ఎంతో జాగ్రత్తగా ఉండాలి టిడిపి శ్రేణులు. కానీ నేరుగా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు విభేదాలకు ఆజ్యం పోస్తుండడంపై హై కమాండ్ సీరియస్ గా ఉంది. మరి ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగుతుందో చూడాలి.
ఈయన బాధను ఎవరికీ చెప్పుకుంటాడు.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే తనను చంపించాలని చూసినప్పుడు
డీఎస్పీ ఎదుట విచారణ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన టీడీపీ నేత సుధాకర్ నాయుడు
ఈయన్ని చంపాలని అనంతపురం ఎమ్మెల్యే అనుచరులు యత్నించారని పోలీసులు పనిగట్టిన విషయం తెలిసిందే pic.twitter.com/mhVSGUd2JI
— greatandhra (@greatandhranews) June 5, 2025