Female MP Secretly Married : వయసు , ఇతర వ్యవహారాలను ఒకప్పటి కాలంలో చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తమకంటే పెద్ద వయసు ఉన్న వారిని మగవాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే.. తమకంటే తక్కువ వయసు ఉన్న వారిని ఆడవాళ్లు వివాహాలు చేసుకుంటున్నారు. వెనుకటి కాలంలో ఇలా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. భవిష్యత్తు కాలంలో ఇలాంటి వింతలు ఎన్ని చోటుచేసుకుంటాయో ఊహించడానికి ఇబ్బందికరంగా ఉంది..
ఇక మనదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా మహువ మొయిత్రా అనే మహిళ ఎంపీగా గెలిచింది. మహిళా ఎంపీ అయినంత మాత్రాన అడ్డగోలు పనులు చేయకూడదు.. అడ్డంగా దోచుకోకూడదు అనే నిబంధనలు ఏమి పెట్టుకోలేదు. పైగా పైసలు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగింది. ఇది కాస్త వివాదం కావడంతో పార్లమెంట్ నియమించిన కాబట్టి ఈమె తప్పు చేసిందని నివేదిక ఇచ్చింది. దీంతో ఈమెను పార్లమెంట్ నుంచి సస్పెండ్ కూడా చేశారు .. కేవలం అది మాత్రమే కాదు అంతకుమించిన గొప్ప ఘన కార్యాలు ఈ మేడంగారు చేశారు. చంచల స్వభావం.. దిక్కుమాలిన వ్యక్తిత్వం.. అవినీతి, అక్రమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మేడంగారి చరిత్ర చాలానే ఉంది. అయితే ఈమె ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే.. ప్రస్తుతం 50 సంవత్సరాల వయసులో మహువా వివాహం చేసుకుంది. ఆమె వయసు, ఆమె పెళ్లి, ఆమె ఇష్టం అని చాలామంది అనుకోవచ్చు. కానీ పబ్లిక్ లైఫ్ లో ఉంది కాబట్టి కచ్చితంగా ఆమె గురించి సహజంగానే చర్చ జరుగుతుంది. ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంది అనే ప్రశ్న మదిలో మెదులుతుంది.. మహువా కు గతంలో వివాహం జరిగిందా? ఆమె ఎలాంటి సంబంధాలలో ఉంది? నే ప్రశ్నలకు సమాధానంలు దొరకడం లేదు గాని.. బి జె డి మాజీ ఎంపీ పినాకి మిశ్రా ను పెళ్లి చేసుకుంది. బెర్లిన్ లో సరిగా రెండు వారాల క్రితం పినాకి, మహువా వివాహం చేసుకున్నారు. కాకపోతే ఈ విషయాన్ని వారు అత్యంత రహస్యంగా ఉంచారు. పెళ్లి చేసుకున్నప్పటికీ అంత రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముందో బయటికి మహువా చెప్పడం లేదు.. ఇక వెస్ట్ బెంగాల్ లోని కృష్ణా నగర్ నుంచి మహువా రెండుసార్లు ఎంపీ గా విజయం సాధించారు.
Also Read : కొంతమంది భార్యలకు ఒళ్లు బలిసిందట.. ఇదేంది డాక్టరక్కా.. ఇట్లా అంటివి
మహువా వివాహం చేసుకున్న పినాకి గతంలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి తన పొలిటికల్ కెరియర్ మొదలుపెట్టారు. ఒడిశా రాష్ట్రంలో పూరి పార్లమెంటు నుంచి 1996లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. ఆ తర్వాత బీజేడీలో చేరారు. అనేక సందర్భాల్లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు.. ఇక మహువా అస్సాం రాష్ట్రంలో 1974లో జన్మించారు. ప్రారంభంలో ఆమె ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించారు. కొద్దిరోజుల తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.. 2010లో మమతా బెనర్జీ పార్టీలో చేరారు. 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆమె కృష్ణ నగర్ స్థానం నుంచి విజయం సాధించారు.. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డేనిష్ ఫైనాన్షియర్ లాస్ బ్రోర్ సన్ తో ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగిందట. అయితే మేడం గారి ప్రవర్తన తీరు నచ్చక విడాకులు ఇచ్చాడటా. మొదటితో విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ మహువా రిలేషన్ కొనసాగించిందట. మూడు సంవత్సరాలు పాటు ఈ బంధం కొనసాగిందట. ఆ తర్వాత ఇద్దరు కటిఫ్ చెప్పుకున్నారట. ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైందో తెలియదు తనకంటే వయసులో 15 సంవత్సరాలు పెద్దవాడైన పినాకిని మహువా వివాహం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ప్రతి విషయంలోనూ లెక్కలు వేసుకునే మహువా.. ఇప్పుడు పినాకిని ఎందుకు వివాహం చేసుకుంది? దానిని ఎందుకు సీక్రెట్ గా ఉంచుతోంది? అనే విషయాలపై స్పష్టత లేదు.
Breaking : TMC MP Mahua Moitra weds BJD MP Pinaki Mishra in Berlin, Germany.
This proves that age is no barrier to finding love.
Congratulations to the couple. pic.twitter.com/QUajmgZbkC
— Roshan Rai (@RoshanKrRaii) June 5, 2025