Talliki Vandanam Scheme Update : టిడిపి కూటమి ప్రభుత్వం( TDP Alliance government ) ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. సూపర్ సిక్స్ పథకాల్లో రెండు కీలకమైన పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. జూన్ నెలలోనే ఆ పథకాలకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ అందించేందుకు నిర్ణయించింది. ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. తల్లుల ఖాతాలో 15వేల రూపాయల చొప్పున జమ చేయనుంది. అయితే పాఠశాలలు తెరవడానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక అప్డేట్ జారీ చేసింది. ఓ రెండు పనులు చేయకపోతే మాత్రం తల్లికి వందనం నిధులు రావని తేల్చేసింది. ఈనెల ఐదు లోగా ఆ పనులు పూర్తి చేయాలని సూచించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తం కాక తప్పదు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం తప్పకుండా అమలు చేస్తారని తెలియడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* లింక్ చేసుకోవాల్సిందే..
ఏప్రిల్ 24 న విద్యాసంస్థలకు వేసవి సెలవులు( summer holidays ) ప్రకటించారు. ఈరోజు నుంచి జూనియర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందే తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు అధికారులు కీలక సూచనలు చేశారు. తల్లికి వందనం నిధులు కట్ కాకుండా.. నేరుగా ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. లబ్ధిదారులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా లింక్ అప్ చేయాలి. ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం నిధులు ఖాతాలో జమ కావని అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల తల్లులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తమ బ్యాంక్ అకౌంట్ ను.. ఆధార్, ఎన్పీసీఐ తో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ లింక్ కాకపోతే ఆ పని పూర్తి చేయాలని సూచించారు.
* సచివాలయాలు, పోస్ట్ ఆఫీస్ లో..
తల్లికి వందనం( Talliki Vandanam) పథకానికి సంబంధించి.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15వేల రూపాయల చొప్పున నగదు జమ చేయనున్నారు. ఇలా నగదు జమ కావాలంటే ఖచ్చితంగా ఆధార్, ఎన్పీసీఐ లింకింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రాష్ట్రంలోని పోస్టల్, సచివాలయ సిబ్బందితో పాటుగా అధికారులు కూడా సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. జూన్ 5వ తేదీలోగా ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు జూన్ లో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే సాగు ప్రోత్సాహం కింద.. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ తో కలిపి నిధులు జమ చేసేందుకు నిర్ణయించింది. తొలి విడతగా కేంద్ర ప్రభుత్వంతో కలిపి 7000 రూపాయలను అందించనున్నట్లు తెలుస్తోంది.
* పేద వర్గాలకు ఊరట.. పాఠశాలలు( schools ) తెరిచేందుకు ఇంకా పది రోజుల వ్యవధి మాత్రమే ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో తల్లికి వందనం నిధులు విడుదలయితే వారికి స్వాంతన చేకూరుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద సాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని తల్లిదండ్రులు ఎదురుచూశారు. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. అయితే తల్లికి వందనం వర్తించాలంటే.. తప్పకుండా ఆ రెండు పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.