Glenn Maxwell Retirement: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 లకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. మ్యాక్స్ వెల్ 149 వన్డేల్లో 3,990 రన్స్ చేశారు. ఇందులో 4 సెంచరీలు, 23 హాఫ్ చెంరీలున్నాయి. 2023 వరల్డ్ కప్ లో అఫ్ఘనిస్థాన్ పై క్లిష్ట పరిస్థితుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. బౌలింగ్ లో 77 వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్ కు అధికారికంగా రిటైర్మెంట్ ఇవ్వలేదు కానీ 2017 లో చివరి టెస్ట్ ఆడాడు.