YSR Political Legacy: ప్రజలతో మమేకమయ్యేవాడే నాయకుడు. అలా మమేకమైన నాయకుడి వద్దకే ప్రజలు వస్తారు. ఈ విషయంలో మాత్రం మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y S Rajasekhara Reddy ) గ్రేట్. ప్రజలతోనే తన ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రజా ప్రతినిధులు ఇట్టే కలిసేందుకు ఆయనకు అవకాశం ఉండేది. అంతవరకు ముందు చూడని కాంగ్రెస్ ముఖ్యమంత్రి లో ఉన్న గొప్ప దాతృత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డిలో కనిపించేది. ఫ్యాక్షన్ లీడర్.. ఆ ఆలోచనలతోనే పాలిస్తారని అంతా భావించారు. కానీ ప్రజల పట్ల కరుణ, బాధ్యత, ప్రేమతో మెలిగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అంతకుమించి సహచర నేతలతో సైతం నడుచుకున్నారు. అధికారం అంటే దర్పం కాదు ఒక బాధ్యత అని గుర్తుచేసేలా వ్యవహరించారు. అందుకే చిరస్మరణీయుడుగా నిలిచారు.
Also Read: ఆ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్!
భారీగా సీఎం సహాయ నిధి
ముఖ్యమంత్రి సహాయనిధి ( CM relief fund )నుంచి ప్రజలకు సాయం పెద్ద ఎత్తున వెళ్లడం రాజశేఖర్ రెడ్డి తోనే మొదలైంది. అందుకే ఆయనను కలిసేందుకు ప్రజలు బారులు తీరేవారు. ఆయనను కలిస్తే తప్పకుండా తమ కష్టాలు తీరుతాయని భావించేవారు అధికం. శాసనసభ సమావేశాల సమయంలో రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల విజిటింగ్కు అవకాశం ఇచ్చేవారు. ప్రత్యేక అనుమతులు, ప్రోటోకాల్స్ ఉండేవి కావు. సాధారణ నేత మాదిరిగా ఆయనను కలిసే సౌలభ్యం ఉండేది. ప్రజా సమస్యలతో ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు వచ్చినా మారు మాట్లాడకుండా చేసి పెట్టడం రాజశేఖర్ రెడ్డి నైజం.
గొప్ప ఉదారత
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. నాడు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఉండేవారు. ప్రజా సంఘాల నుంచి.. వామపక్షాల నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వారు కూడా ఉండేవారు. ఈ క్రమంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసేవారు. ప్రజా సమస్యలపై ఎక్కువగా పోరాటం చేసేవారు. ఈ క్రమంలో అప్పట్లో ఎమ్మెల్సీగా ఉండేవారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల వయస్సు తగ్గించాలని కోరుతూ ఆయన 500 మంది నిరుద్యోగులతో కలిసి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని సంప్రదించారు. అయితే మారు మాట ఆడకుండా ఆయన ఆ ఫైల్ పై సంతకం చేశారు. సీఎం రాజశేఖర్ రెడ్డి జిందాబాద్ అంటూ ఆ నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి వద్దు అని వారించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చారు కాబట్టి పరిష్కరించగలిగాను. ఈ క్రెడిట్ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ది అంటూ తేల్చి చెప్పారు. అంతటి సుగుణశాలి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. ఒక్క ప్రొఫెసర్ కాదు.. ప్రత్యర్థులు సైతం మెచ్చిన నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి.
చేసేది కొండంత, చెప్పేది గోరంత : YSR, YSJ
చేసేది గోరంత, చెప్పేది కొండంత : CBN
Prof K Nageshwar’s experience with YSR is a testament to his character. ❤️ pic.twitter.com/Pjitvvdm8L
— Chaitanya Reddy (@ltsChaitanya) July 8, 2025