Tadipatri Political Clash: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలోకి జేసీ కుటుంబం వెళ్తుందా? ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ. ఈ విషయాన్ని టిడిపి సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి రావడంతో సంచలనంగా మారింది. ప్రస్తుతం తాడిపత్రిలో టిడిపి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఉంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎదురుపడితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జెసి బ్రదర్స్ కొట్టుకునేంత పరిస్థితి ఉంది. వైసిపి అధికారంలో ఉన్నన్నాళ్లు జెసి ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు పెద్దారెడ్డి. అయితే ఇప్పుడు అదే పెద్దారెడ్డి ఓడిపోవడంతో సీన్ మారింది. ఏడాదిగా తన సొంత నియోజకవర్గానికి.. సొంత ఇంటికి రాలేని స్థితిలో ఉన్నారు పెద్దారెడ్డి. తాడిపత్రికి వస్తే రప్పా రప్పా అంటూ గట్టి హెచ్చరికలే పంపారు జెసి ప్రభాకర్ రెడ్డి. అటు పెద్ద రెడ్డి సైతం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: లోకేష్ వర్సెస్ అమర్నాథ్ : ఏంటీ గుడ్డు, శోభనం కథ?
మీడియా ముందు సంచలనం..
అయితే తాడిపత్రిలో( Tadipatri) తాజాగా జరిగిన పరిస్థితులను వివరించేందుకు మీడియా ముందుకు వచ్చారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.’ నా ఆస్తులు అన్ని పోయినా నేను బాధపడలేదు. నా కొడుకును జైల్లో వేయించిన నేనెప్పుడూ బాధపడలేదు. మాజీ ఎమ్మెల్యే నా ఇంట్లోకి వచ్చి వెళ్ళాడే.. అదే బాధగా ఉంది’ అంటూ చెప్పారు జెసి ప్రభాకర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇల్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయింది. కలెక్టర్ డివియేషన్ చేయమని లెటర్ కూడా ఇచ్చారు. వైసీపీ నాయకుల జోలికి మేం పనిగట్టుకుని వెళ్లలేదు. లీగల్ గానే వెళ్తున్నాం. వైసీపీ కార్యకర్తల జోలికి ఎప్పటికీ రాం. అంతేకాదు మేము త్వరలో వైసీపీలోకి రావచ్చు. ఎందుకంటే వైయస్ ఫ్యామిలీతో మాకు చాలా అనుబంధం ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పై నాకు కక్ష ఉంది. అయితే నేను అత్తటిపై లీగల్ గానే వెళ్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. అయితే పరిస్థితులను వివరించే ప్రయత్నంలో భాగంగా జెసి ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వెళ్తాం అన్నమాట ఇప్పుడు హైలైట్ అవుతుంది.
Also Read: తల్లి చనిపోదామంటోందని.. 8 ఏళ్ల కొడుకు చేసిన సాహసం కన్నీళ్లు పెట్టిస్తోంది
వైయస్సార్ కుటుంబంతో అనుబంధం
వైయస్ కుటుంబంతో జెసి ఫ్యామిలీకి( JC family) మంచి అనుబంధం ఉంది. ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు రాజకీయ వైరం ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు జెసి దివాకర్ రెడ్డి. అయితే రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే రెండోసారి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితి మారింది. జెసి దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయనలో అసంతృప్తి ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసిన అందుకే అటువైపు వెళ్లలేదు జెసి కుటుంబం. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరి కొనసాగుతూ వస్తుంది జెసి ఫ్యామిలీ. అయితే జెసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహితుడు. ఇద్దరూ క్లాస్మేట్స్ కూడా. అయితే తాజాగా జెసి ప్రభాకర్ రెడ్డి ప్రకటన చూస్తుంటే మాత్రం ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. ఒకవేళ 2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ వేవ్ కనిపిస్తే మాత్రం జెసి కుటుంబం టిడిపిని వదిలిపెట్టడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.