Gudivada Amarnath Vs Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) పొలిటికల్ పంచ్ లు మామూలుగా లేవు. నేతలు ఒకరినొకరు రాగింగ్ చూసుకుంటున్నారు. అప్పట్లో మాకు ఇలా అంటారా? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి అని కొత్త పేర్లు పెడుతున్నారు. ‘తొందరెందుకన్న’ అన్న అనిల్ కుమార్ యాదవ్ మాటలను.’కోడి ముందా.. గుడ్డు ముందా’ అన్న గుడివాడ అమర్నాథ్ మాటలను కూటమి నేతలు ఏ రేంజ్ లో విరుచుకుపడేవారు తెలిసిందే. అయితే తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో ‘ నీకు 15 వేలు, నీకు 15 వేలు’ అన్న కామెంట్స్ పై విపరీతంగా టార్గెట్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా తనపై గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్.
Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?
* అప్పట్లో ట్రోలింగ్ బాధితుడు..
వైసిపి హయాంలో ఎక్కువగా ట్రోల్ కు గురైంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath). గుడ్డు మంత్రిగా గుర్తింపు పొందారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ అప్పట్లో దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏపీలో పెట్టుబడుల గురించి ప్రశ్నిస్తే.. కోడి ముందా? గుడ్డు ముందా? అని తిరిగి ప్రశ్నించారు. గుడ్డు మంత్రిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురయ్యారు. అయితే గతంలో ఇదే గుడివాడ అమర్నాథ్ పై స్పందించారు లోకేష్. అప్పట్లో మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఉద్దేశించి మాస్ ర్యాగింగ్ చేశారు. యువ గళం పాదయాత్ర ముగింపు వేడుకల్లో గుడ్డు మంత్రి అంటూ అమర్నాథ్ ను ఉద్దేశించి హేళన చేశారు.
* తాజాగా అమర్నాథ్ కౌంటర్..
అయితే తాజాగా మంత్రి లోకేష్ ను( Minister Lokesh) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్. శోభనం లోకేష్ అంటూ కామెంట్ చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తానని లోకేష్ ప్రకటించారని.. లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని.. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాట నిలుపుకోలేని లోకేష్.. శోభనం లోకేష్ అని తాను అంటున్నానని.. ఇకనుంచి అలానే పిలుస్తానని ప్రకటించారు. అయితే ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ కంటే మంత్రి బాగానే పనిచేస్తున్నారన్న ప్రశంసలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ పిలుపు ఆయనకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అసలే ఆయన సోషల్ మీడియా ట్రోలింగ్ బాధితుడు. ఆయనపై ఇది ప్రతికూలంగా చూపే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
అమర్నాథ్ మాస్ రివెంజ్ pic.twitter.com/icqhuUO2Iv
— Graduate Adda (@GraduateAdda) June 30, 2025