Shirt buttons: ఫ్యాషన్ ప్రపంచంలో, ప్రతిదానికీ కొంత అర్థం ఉంటుంది. కానీ కొందరు కొన్ని విషయాలను పట్టించుకుంటే కొందరు లైట్ తీసుకుంటారు. పని నడుస్తుంది. అందంగా కనిపిస్తున్నాయి. అంతే హిస్టరీ మాకెందుకు లే అనుకుంటారు. కానీ కొన్ని సార్లు వాటి గురించి తెలుసుకుంటే చాలా సంతోషంగా, ఆనందంగా, బాధ్యతగా కూడా వాటిని ఉపయోగించవచ్చు. మనం నిత్యం ఉపయోగించే వీటి వెనుక ఇంత కథ ఉందా అని తెలిస్తే భలే అనిపిస్తుంది కూడా. అయితే ఈ రోజు మనం అలాంటి ఓ టాపిక్ గురించి తెలుసుకుందాం.
బట్టల డిజైన్ అయినా లేదా బటన్ల వైపు ప్లేస్ అయినా సరే వాటి హిస్టరీ గురించి మీకు తెలుసా? అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ దుస్తులు కొంటారు. వేసుకుంటారు. ఇది కామన్. కానీ అమ్మాయిల చొక్కాలు లేదా కుర్తాలలో బటన్లు ఎప్పుడైనా ఎడమ వైపున, అబ్బాయిల దుస్తులలో అవి కుడి వైపున ఉంటాయనే విషయం మీరు గమనించారా? అయితే, ఇది కొత్త ట్రెండ్ కాదు. కానీ ఇది శతాబ్దాలుగా జరుగుతోంది. ఆధునిక ఫ్యాషన్ మారి ఉండవచ్చు. కానీ కొన్ని క్లాసిక్ శైలులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. బటన్ వైపు కేవలం దుస్తులలో ఒక భాగం మాత్రమే కాదు. దాని వెనుక చరిత్ర, సౌలభ్యం, సామాజిక సంప్రదాయాలు కూడా దాగి ఉన్నాయి. ఈ చిన్న విషయం పెద్ద ఫ్యాషన్ కథలలో భాగమైంది. ఈ రోజు మా వ్యాసం కూడా ఈ అంశంపైనే..
- Read Also: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీం?
బటన్ ఎడమ వైపున ఎందుకు?
ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మాయిల చొక్కాల బటన్లు ఎడమ వైపున ఎందుకు ఉంచుతారు? ఈ ట్రెండ్ ఎప్పుడు ఎందుకు ప్రారంభం అయిందో తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు. 13వ శతాబ్దంలో , డబ్బుకు కొరత లేని వారు మాత్రమే చొక్కాలు ధరించగలరని చెబుతారు . పెద్ద ఇళ్లలో, స్త్రీలకు లేదా అమ్మాయిలకు దుస్తులు ధరించడానికి పనిమనిషులు ఉండేవారు. వారు వారికి దుస్తులు వేసేవారు. అటువంటి పరిస్థితిలో, మరొకరు వాటిని సులభంగా మూసివేయగలిగేలా ఎడమ వైపున బటన్లు ఉంచేవారు. అప్పటి నుంచి, ఈ ట్రెండ్ నేటి కాలంలో కూడా ఫ్యాషన్ ప్రపంచంలో ఒక భాగంగా ఉంది.
పురుషుల చొక్కాల బటన్లు?
మరోవైపు, మనం అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే, వారు తమ చొక్కాలను వారే ధరించేవారు. వారే వాటి బటన్‌లను వేసుకోవాల్సి వచ్చేది. అందుకే వారి చొక్కాల బటన్‌లను కుడి వైపున ఉంచేవారు. దీనివల్ల వారికి బటన్‌లు వేయడం సులభం అయింది. స్త్రీలు తమ బిడ్డకు పాలు తాగించడం కూడా సులభం. ఇక పిల్లలను తినిపించడానికి ఎడమ వైపున పట్టుకుంటారు తల్లులు. దీని కోసం, వారు చొక్కా బటన్లను తెరవడానికి వారి కుడి చేతిని ఉపయోగించాలి. మహిళల చొక్కాల బటన్లను ఎడమ వైపున ఉంచడానికి ఇది కూడా ఒక కారణం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.