Surya Ghar Yojana In AP: ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రజల కోసం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వృధా అయిపోతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరినప్పుడే వాటి ఉపయోగం ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇస్తున్న ఒక పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా డబ్బును సమకూర్చి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో సమగ్రంగా అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు జూన్ నెలలో పరుగులు పెట్టడం ఖాయం అని తెలుస్తుంది. ప్రజలు చాలా అలర్ట్ గా ఉండి ఈ పథకం ప్రయోజనాలను పూర్తిగా పొందే లాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు రెడీగా ఉంది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ప్యానల్ లను సబ్సిడీ ధరలకు ఇళ్లపై ఏర్పాటు చేస్తారు. రెండు కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఎస్సీ మరియు ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తారు.
Also Read: ఏపీలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం పై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..
ఈ క్రమంలో వాళ్లందరూ ఎటువంటి సమస్య లేకుండా తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ లను ఉచితంగా ఏర్పాటు చేసుకొని ప్రతినెల ఉచిత కరెంటును పొందవచ్చు. ఈ క్రమంలో వాళ్లు అధిక కరెంటు బిల్లుల సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కులాల వారికి అలాగే బీసీ కుటుంబాల వారికి ఈ పథకం కింద రూ.60 వేలు సబ్సిడీ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.60,000 సబ్సిడీతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరింత అదనంగా రూ.20 వేల రూపాయలు సబ్సిడీని అంటే మొత్తం రూ.80 వేల సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల కులాల వారు అలాగే బీసీ కుటుంబాల వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఇళ్లపై సబ్సిడీకి సోలార్ ప్యానెల్ లను ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్లందరూ తమ ఇళ్లపై రూ.1.20 లక్షల సోలార్ గ్రూప్ టాప్ సిస్టంను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవడానికి మీరు కేంద్రం https://pmsuryaghar.gov.in/#/ అనే అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వడం ద్వారా దీనికోసం అప్లై చేసుకోవచ్చు. లాగిన్ అవ్వడానికి మీరు మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. దానిని ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీరు పూర్తి వివరాలను ఎంటర్ చేస్తూ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అవి ఎలా చేయాలో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ట్రైనింగ్ వీడియోలను కూడా అందుబాటులో ఉంచింది.