New Rules 1 June 2025: ఈ మార్పులను తెలుసుకోవడం ద్వారా మీరు మీ ఆర్థిక కార్యకలాపాలను మరింత సులభంగా చేసుకోవచ్చు. జూన్ నెల లో జరిగే కొన్ని కీలకమైన మార్పులు మన ఆర్థిక జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్, పిఎఫ్ నిబంధనలు, వడ్డీ రేట్లు, క్రెడిట్ కార్డులు, ఆధార్ అప్డేట్ ప్రక్రియ సహా అనేక వాటిలో మార్పులు జరగనున్నాయి. వీటి గురించి మీరు తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. జూన్ 1వ తేదీ నుంచి భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ కి కొత్త కట్ ఆఫ్ సమయాలను అమలు చేసింది. ఈ క్రమంలో సెబి ఆన్లైన్లో చేసే లావాదేవీలకు సాయంత్రం ఏడు గంటలుగా అలాగే ఆఫ్లైన్లో చేసే లావాదేవీలకు మధ్యాహ్నం మూడు గంటలుగా సమయం తెలిపింది. ఈ సమయం తర్వాత చేసిన లావాదేవీలు అన్ని తర్వాతి రోజున ప్రాసెస్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో మీ పెట్టుబడికి వర్తించబడే నెట్ ఆస్తి విలువ కూడా మారుతుంది అని గమనించగలరు. చాలా తక్కువ తీసుకున్నా పెట్టుబడి ఎంపికగా ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటాయి. ఒకరోజు వ్యవధి కలిగిన ప్రభుత్వ బాండ్లు కూడా వీటిలో ఉంటాయి.
Also Read: ఏపీ ప్రభుత్వం సంచలన గుడ్ న్యూస్.. వాళ్లందరికీ ఉచితంగా రూ.80 వేలు.. జూన్ నెలలో ఈ పథకం అమలు..
ఈ కొత్త మార్పులు ఫండ్ కార్యకలాపాల నిర్వహణను మరింత సులభంగా మరియు సమర్థవంతంగా చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలాగే జూన్ 1వ తేదీ నుంచి కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకులో నెలవారి ఫ్యూయల్ ఖర్చు ఒక స్థాయి దాటినట్లయితే 1% ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనున్నారు. ఆన్లైన్ గేమింగ్ పై కూడా వీటిలో అదనపు చార్జీలు వసూలు చేస్తారు. జూన్ నెలలో ఈపీఎఫ్వో ఈపీఎఫ్ఓ 3.0 సిస్టంను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇకపై పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు విత్డ్రా చేయాలని అనుకుంటున్నావాలో ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.
యూపీఐ యాప్ల ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయడంతో పాటు ఇతర సేవలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఫార్మ్ 16 పొందడానికి చివరి తేదీ జూన్ 15 గా సమాచారం. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ అఫ్ ఫైల్ చేసే వారికి ఇది చాలా ముఖ్యమైనది.అలాగే జూన్ 14 వరకు మాత్రమే మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత అప్డేట్ చేసుకునే వారికి 25 రూపాయలు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆయిల్ కంపెనీలు ధరలను మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో జూన్ 1వ తేదీన కూడా గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పు వచ్చే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీన వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నాయి.