https://oktelugu.com/

YS Sharmila: వైయస్ షర్మిల కొడుకు పెళ్లిలో సర్ ప్రైజ్ లివీ

శనివారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఉమైద్ భవన్ లో వివాహ వేడుక జరుగుతుంది. షర్మిల క్రైస్తవ మతస్తురాలు కావడంతో ముందుగా ఆచార ప్రకారం వివాహ వేడుక జరుపుతారు.

Written By: , Updated On : February 16, 2024 / 01:56 PM IST
YS Sharmila

YS Sharmila

Follow us on

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొడుకు వైయస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించి రాజస్థాన్ జోధ్ పూర్ ప్రాంతంలోని ఉమైద్ భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.. విశిష్ట అతిధులు హాజరు కావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. అతి కొద్దిమంది వీవీఐపీల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిపేందుకు షర్మిల ఏర్పాట్లు చేశారు. షర్మిల కుటుంబం తరఫునుంచి, అనిల్ కుటుంబం తరఫునుంచి, ప్రియా అట్లూరి కుటుంబం తరఫునుంచి అతి ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే వివాహానికి హాజరవుతున్నారు. వివాహం అనంతరం షర్మిల హైదరాబాద్ లేదా విజయవాడలో విందు ఏర్పాటు చేయనున్నారు.

శనివారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఉమైద్ భవన్ లో వివాహ వేడుక జరుగుతుంది. షర్మిల క్రైస్తవ మతస్తురాలు కావడంతో ముందుగా ఆచార ప్రకారం వివాహ వేడుక జరుపుతారు. ఈ వేడుక పులివెందులకు చెందిన కొంతమంది పాస్టర్ల సమక్షంలో జరగనుంది. ఇది పూర్తయిన తర్వాత హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం నిర్వహిస్తారు.. ఈ రెండు విధానాల్లో వివాహం పూర్తయిన తర్వాత వేడుకకు హాజరైన విశిష్ట అతిధులకు విందు ఏర్పాటు చేస్తారు. జోధ్ పూర్ ప్రాంతంలో వివాహం జరుపుతున్నప్పటికీ దక్షిణ భారత ప్రాంతానికి చెందిన వంటకాలనే వడ్డిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాదులోని ప్రఖ్యాత హోటల్ కు చెందిన చెఫ్ లు అక్కడికి చేరుకున్నారని సమాచారం..సూప్ లు, చికెన్, మటన్, పీతలు, చేపలు, కౌజు పిట్టల మాంసంతో తయారుచేసిన వంటకాలు.. అరేబియన్, మొగలాయి, హైదరాబాదీ డిష్ లను కూడా మెనూలో చేర్చారు. మాంసాహారం తినని వారికి అదే స్థాయిలో శాకాహార వంటకాలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ వంటకాలన్నింటినీ రాజస్థానీ శైలిలో రాగి పాత్రల్లో వడ్డించనునట్టు సమాచారం.

వివాహ వేడుక నేపథ్యంలో ఉమైద్ భవన్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన పూలతో అలంకరించారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను రాజారెడ్డి, ప్రియ అట్లూరి ధరించనున్నారు. ఈ వేడుక కోసం గత బుధవారమే షర్మిల, ఆమె భర్త అనిల్, తల్లి విజయలక్ష్మి, ఇతర ముఖ్యులు రాజస్థాన్ వెళ్లిపోయారు.. శుక్రవారం నుంచి వివాహ వేడుకకు సంబంధించి సంబరాలు మొదలయ్యాయి. శుక్రవారం సంగీత్.. శనివారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు వివాహం.. ఆదివారం రిసెప్షన్ నిర్వహించనున్నారు. విశిష్ట అతిథులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ముఖ్యమైన అతిధుల కోసం షర్మిల ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేశారు.. ప్రియా అట్లూరి తాత చట్నీస్ రెస్టారెంట్ల నిర్వాహకుడు ప్రసాద్. అతడు కూడా ఆగర్భ శ్రీమంతుడు కావడంతో ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.