Sujana Chaudhari : ఏపీ రాజకీయాలు( AP politics) ఎప్పుడు ప్రత్యేకమే. ఎన్నికల సమయంలోనే కాదు.. సాధారణ రోజుల్లో సైతం హాట్ హాట్ గా ఉంటాయి. ఇక్కడ హుందా రాజకీయాలు చేస్తామంటే కుదిరే పని కాదు. ప్రతి అంశం చుట్టూ రాజకీయాలు నడుస్తుంటాయి ఇక్కడ. అటువంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి లండన్ లో ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసుకున్నారు. ఈనెల 16న డిగ్రీ ప్రధానోత్సవం జరిగింది. కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమార్తె ను అభినందిస్తూ భావోద్వేగ ట్విట్ పెట్టారు. వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయితే అనూహ్యంగా చంద్రబాబుకు అత్యంత విధేయుడు, జగన్ ను ద్వేషించే నేత ఒకరు దీనిపై స్పందించారు. రీ ట్వీట్ చేశారు. కానీ కాసేపటికి ఆ పోస్టును డిలీట్ చేశారు. కేవలం రాజకీయ కోణంతోనే ఆ పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి.
* టిడిపి తోనే పొలిటికల్ ఎంట్రీ
ఏపీ రాజకీయాల్లో సుజనా చౌదరికి ( Sujana Chaudhari) ప్రత్యేక స్థానం. టిడిపి తో పాలిటిక్స్ లో అడుగు పెట్టారు చౌదరి. ప్రస్తుతం బిజెపి తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో టిడిపి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో కేంద్ర మంత్రిగా పదవి పొందారు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి చవి చూడడంతో సుజనా తో పాటు టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిపోయారు. ఆయన బిజెపిలో చేరినా.. చంద్రబాబు విషయంలో మాత్రం ప్రత్యేక గౌరవభావంతో నడుచుకుంటూ వచ్చారు. పేరుకే ఆయన బిజెపి కానీ.. సుజనాను మాత్రం ఇప్పటికీ టిడిపి శ్రేణులు తమ వాడిగానే భావిస్తాయి.
* చంద్రబాబు పట్ల విధేయత
టిడిపి తో పాటు చంద్రబాబు( Chandrababu) పట్ల వీర విధేయతతో మెలుగుతారు సుజనా చౌదరి. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉండే చౌదరి జగన్ పై విమర్శలు చేయడానికి మాత్రం వెనుకడుగు వేయరు. అటువంటిది జగన్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ కు సుజనా చౌదరి స్పందించడం విశేషం. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇది. చిన్న కుమార్తె వర్షా రెడ్డి స్నాతకోత్సవ కార్యక్రమానికి జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా హాజరయ్యారు. మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా గురువారం రాత్రి ఎక్స్ వేదికగా తమ ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్టును చూసి జగన్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా సుజనా చౌదరి స్పందించారు.’ లండన్ లోని ప్రఖ్యాత కింగ్స్ కాలేజీ నుంచి డిస్టింక్షన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వర్షా రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ జగన్ ట్వీట్ ను కోట్ చేస్తూ సుజనా చౌదరి పోస్ట్ చేశారు. క్షణాల్లో ఇది వైరల్ అయింది. జగన్ అభిమానులు థాంక్యూ సుజనా చౌదరి గారు అంటూ కామెంట్లు చేయగా.. టిడిపి సానుభూతిపరులు మాత్రం ఇప్పుడు ఇది అవసరమా? అంటూ కామెంట్స్ పెట్టారు.
* కొద్దిసేపటికి పోస్ట్ డిలీట్
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. కాసేపట్లోనే సుజనా చౌదరి( Sujana Chaudhari ) తన పోస్టును డిలీట్ చేశారు. అయితే రాజకీయాలు వేరు.. వ్యక్తిగత అభినందించుకోవడం వేరు. ఈ విషయంలో సుజనా చౌదరి చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఆయన జగన్ కు వ్యక్తిగతంగా పెట్టబోయి.. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే డిలీట్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.