CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu) ఈనెల 19న దావోస్ పర్యటనకు( davos tour) వెళుతున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. గతంలో తమిళనాడుకు భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయిన అధికారిని చంద్రబాబు తన వద్దకు రప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా సరిన్ పరాపరకాత్ ను ఏపీ సర్కార్ నియమించింది. దీంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తమిళనాడు ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారి రావడంతో.. ఏపీకి పెట్టుబడులు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* 19 న దావోస్ కు
ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు( CM Chandrababu) నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈనెల 19 న దావోస్ వెళ్లనుంది. నాలుగు రోజులపాటు ఏపీ బృందం దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరు కానుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పెట్టుబడిదారులు, కంపెనీలను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నారు. గత ఐదేళ్ల కాలంలో వైసిపి ప్రభుత్వం దావోస్ సదస్సును చాలా తేలిగ్గా తీసుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం భారీగా పెట్టుబడులు పొందగలిగింది. అందుకే చంద్రబాబు సర్కార్ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
* పెట్టుబడులే టార్గెట్
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీలో కొత్తగా ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డ్ ను( economic development board) ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే చంద్రబాబు కొత్త ప్రణాళిక వేశారు. తమిళనాడుకు చెందిన వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ బోర్డుకు సరిన్ పరాపరకాత్ ను వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. గతంలో ఈయన నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. అటు తరువాత తమిళనాడుకు ఈయన సేవలందించడంతో ఆ రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరిగాయి. ఇప్పుడు చంద్రబాబు ఆయనను నేరుగా ఆహ్వానించి ఏపీ ఎకానమిక్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే ఇది తమిళనాడు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే ఏజెన్సీగా ఉండేలా.. ఈ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డును బలోపేతం చేశారు చంద్రబాబు.
* వారంతా వెనక్కి
పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటుచేసిన ఈ డెవలప్మెంట్ బోర్డ్ లో( economic development board ) వివిధ కన్సల్టెన్సీ సంస్థల నుంచి మొత్తం పదిమంది టాప్ ఎగ్జిక్యూటివ్లను నియమించారు. ఇన్వెస్ట్ ఇండియా నుంచి మరో ఇద్దరి నియామకం జరిగింది. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ టీం పని చేయనుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో సైతం ఎకానమిక్ బోర్డును ఏర్పాటు చేశారు. అప్పట్లో 12 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఉండేవారు. ఇప్పుడు వారందరినీ వెనక్కి రప్పించారు. మొత్తానికైతే దావోస్ పర్యటన వేళ.. భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.