Nimmala Rama Naidu : రాజకీయాల్లో( politics) ఒక ట్రెండ్ నడుస్తోంది. చిన్న పదవులు వస్తే చాలు దర్పం ప్రదర్శిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఓ రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ కానీ సమయంలో రైతుగా అవతారం ఎత్తుతున్నారు. సామాన్య రైతులా వ్యవసాయ పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను మంత్రి నైనా రైతు బిడ్డగానే తనకు ఇష్టమని చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రి కాక మునుపు ఎమ్మెల్యేగా రామానాయుడుకు మంచి పేరు ఉంది. సామాన్యులతో మమేకమయ్యే తీరు ప్రత్యేకం. ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుడిగా, వారి జీవితాలతో మమేకమయ్యే వ్యక్తిగా రామానాయుడు కు మంచి పేరు ఉంది. అందుకే ఆయన పాలకొల్లు నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
* హ్యాట్రిక్ విజయం
2014 ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం( Palakollu constituency ) నుంచి పోటీ చేశారు నిమ్మల రామానాయుడు. ఆ ఎన్నికల్లో గెలుపు బాట పట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయన ప్రజలతో మమేకమయ్యే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. వరద సమయాల్లో ప్రజలను కలుసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం చాలా సార్లు ఆకట్టుకుంది. ప్రతి గ్రామంలో… ప్రతి గడపను ఆయన టచ్ చేసారు. పిల్లలనుంచి పెద్దవారి వరకు అందర్నీ పేరు పెట్టి పిలిచే ఔన్నత్యం ఆయన సొంతం. ఈ ఎన్నికల్లో పాలకొల్లు నుంచి మూడోసారి గెలిచేసరికి చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తించి జలవనరుల శాఖను ఆయనకు అప్పగించారు చంద్రబాబు.
* ఎంత ఎత్తుకు ఎదిగినా
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం నిమ్మల రామానాయుడు( Nirmala Rama Naidu ) సొంతం. ఇటీవల సంక్రాంతి సందర్భంగా తన సొంత గ్రామానికి వెళ్లారు. ఊర్లో ఉండే తన పొలాలను చూసేందుకు సామాన్య రైతుగా వెళ్లారు. వరి పొలంలో స్వయంగా సస్యరక్షణ చేపట్టారు. పురుగుల మందు స్ప్రే చేశారు. ఒక సామాన్య రైతు మాదిరిగా పొలం పనులు చేస్తున్న ఆయనను చూసి స్థానికులు ఎంతో ఆనందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పొలం పనులు చేసిన వీడియోలు, ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
* విద్యాధికుడు కూడా
వాస్తవానికి నిమ్మల రామానాయుడు( Nirmala Rama Naidu ) విద్యాధికుడు. గతంలో లెక్చరర్ గా కూడా విధులు నిర్వహించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం పట్ల తన అభిమానాన్ని చాటుకునేవారు. ఎంత పనుల్లో ఉన్నా.. పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వ్యవసాయంతో పాటు ఆక్వా సాగులో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాను వ్యవసాయం చేసిన రోజుల్లో ఎకరాకి 55 నుంచి 60 బస్తాలు దిగుబడి సాధించే వాడినని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ ఆయన వ్యవసాయం పట్ల మక్కువ మాత్రం తగ్గించుకోలేదు.
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా… కాలేజీ అధ్యాపకుడిగా పని చేస్తున్న నా సొంత గ్రామంలో వ్యవసాయం మాత్రం నేనే సొంతంగా చేస్తూ వరిలో ఎకరానికి 55 నుండి 60 బస్తాలు దిగుబడి సాధించడమే కాక ఆక్వా సాగులో కూడా మంచి ఫలితాలు సాధించే వాడిని. మంత్రిగా సమయం దొరకని స్థితిలో నేడు… pic.twitter.com/YGxrbktfY2
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) January 15, 2025