https://oktelugu.com/

Guntur : పాము కాటు వేసింది.. మూఢనమ్మకం ప్రాణం తీసింది.. గుంటూరులో మయన్మార్ విద్యార్థి విషాదాంతం

ప్రమాదవశాత్తు అతడిని పాము కాటు వేసింది. ఆ సమయంలో సత్వరమే చికిత్స తీసుకుంటే అపాయం నుంచి బయటపడేవాడు. కానీ ఆ పామును చంపిన తర్వాతే తాను ఆసుపత్రికి వెళ్తానని అతడు భీష్మించుకు కూర్చోవడం ప్రాణాల మీదికి తెచ్చింది. చివరికి జరగరాని ఘోరం జరిగిపోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 9, 2024 / 05:10 PM IST

    Mayanmar Student

    Follow us on

    Guntur :  పాము కాటు వేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు దక్కేవి. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. దానిని చంపిన తర్వాతే చికిత్సకు వెళ్తానని స్పష్టం చేశాడు. ఇలా గంటన్నర పాటు సమయం వృధా అయ్యింది. ఫలితంగా అతని ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ సంఘటన గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగింది. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో మయన్మార్ ప్రాంతానికి చెందిన కొండన్న అనే విద్యార్థి ఎంఏ బుద్ధిజం చదివినందుకు గత నెలలో ఈ ప్రాంతానికి వచ్చాడు. నాగార్జున యూనివర్సిటీలోని అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహంలో అతడు ఉంటున్నాడు.. శనివారం రాత్రి 10 గంటలకు మయన్మార్ దేశానికి చెందిన స్నేహితుడితో కలిసి అతడు బయటికి వెళ్ళాడు. వారిద్దరూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక పుట్ట వద్ద పుట్టగొడుగులను సేకరించినందుకు ప్రయత్నిస్తున్నారు. కిలోగా పుట్టలో నుంచి ఒక పాము బయటికి వచ్చింది. అది కొండన్నను కాటు వేసింది.. కాటు వేసిన పాము విషపూరితమైనది కావడంతో కొండన్నకు వెంటనే విషం ఎక్కింది.

    అక్కడ అలా చేస్తారట

    మయన్మార్ దేశంలో పాము కాటు వేస్తే.. దానిని చంపిన తర్వాతే ఆస్పత్రికి వెళ్తారట. కాటు వేసిన పాము జాతి ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారట. వాస్తవానికి శనివారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు కొండన్నను రక్త పింజర పాము కరిచింది. దాదాపు రాత్రి 12 గంటల వరకు ఆ పాము కోసం కొండన్న, అతడు స్నేహితుడు గాలించారు. చివరికి ఆ పాము దొరకడంతో దానిని చంపారు. ఆ పాముతో పాటు వారు మంగళగిరిలోని ఎన్నారై హాస్పిటల్ వెళ్లారు. ఇక్కడ వైద్యులు పెట్టన చికిత్స మొదలుపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో కొండన్న ప్రాణం కోల్పోయాడు.. కొండన్న మయన్మార్ లోని క్యూహ బుద్ధిజం యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. హయ్యర్ స్టడీస్ కోసం ఇక్కడికి వచ్చాడు. సోమవారం నుంచి క్లాసులు మొదలుకానున్నాయి. ఎంతో ఆశతో ఉన్నత విద్యను చదివేందుకు అతడు భారత వచ్చాడు. తరగతులు ప్రారంభం కాకముందే అతడు చనిపోవడంతో తోటి విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక కొండన్న మృతిపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్టర్ సింహాచలం స్పందించారు.. ఈ ఘటన యూనివర్సిటీ బయట కాలువ గట్టుపై జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పెదకాకాని పోలీస్ స్టేషన్లో తమ ఫిర్యాదు చేశామని సింహాచలం అన్నారు.. అయితే ఘటన జరిగిన ప్రాంతం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ కేసును పోలీసులు అక్కడికి బదిలీ చేశారు.. కొండన్న మృతదేహాన్ని ఆదివారం రాత్రి మయన్మార్ తరలించారు. సోమవారం అక్కడ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని అతడి స్నేహితుడు చెబుతున్నారు.