https://oktelugu.com/

Devara: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా చంద్రబాబు – పవన్ కళ్యాణ్..? ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే అప్డేట్!

మొదటి రోజు 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 24 వ తారీఖున అమరావతి లో గ్రాండ్ గా ప్లాన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 / 04:59 PM IST

    Devara Movie

    Follow us on

    Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న ‘దేవర’ చిత్రం ఈ నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద మార్కెట్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, కేవలం నార్త్ అమెరికా లోనే అప్పుడే 1 మిలియన్ డాలర్స్ ప్రీమియర్స్ కి అతి చేరువలో ఉంది. రేపు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. కాసేపటి క్రితమే మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ట్రైలర్ విడుదల తర్వాత నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉన్నప్పటికీ ఈ స్థాయి ట్రెండ్ ఉందంటే, ఇక ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయితే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

    మొదటి రోజు 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 24 వ తారీఖున అమరావతి లో గ్రాండ్ గా ప్లాన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి బలంగా వినిపిస్తున్న మాట. ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదిక మీద కనిపిస్తే ఇంకేమైనా ఉందా?, మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు కలిస్తే 10 లక్షల మంది జనాలు పట్టేంత మైదానం కావాలి. అలాంటి మైదానం కోసం మూవీ టీం ప్రస్తుతం అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఒకే వేదిక పై కనిపించి చాలా కాలమే అయ్యింది. ఈ ఈవెంట్ తో అభిమానుల్లో ఉన్నటువంటి ఆ చిరకాల కోరిక కూడా తీరబోతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ‘అరవింద సమేత’ మూవీ ఓపెనింగ్ కి ముఖ్య అతిథి గా విచ్చేసి ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలియచేసాడు.

    అప్పట్లో ఈ సంఘటన ఇరువురి హీరోల అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇప్పటికీ కూడా అభిమానులు ఆ వీడియో ని చూసి మురిసిపోతూ ఉంటారు, వాళ్ళ జ్ఞాపకాల్లో చిరకాలం గుర్తుండిపోయే మరో వీడియో అతి త్వరలోనే రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ఈ నెల మొత్తం దేవర మూవీ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడపనున్నాడు. అందులో భాగంగా ఆయన పలు ఇంటర్వూస్ కూడా ఇచ్చాడు. రీసెంట్ గానే డైరెక్టర్ సందీప్ వంగ ఎన్టీఆర్ తో ఒక ఇంటర్వ్యూ చేసాడు, రెండు రోజుల్లో ఈ ఇంటర్వ్యూ అప్లోడ్ కాబోతుంది.