Stand Up Comedy Controversy: ఇటీవల స్టాండప్ కామెడీ( stand up comedy ) వివాదాస్పదం అవుతోంది. మొన్న మధ్యన స్టాండప్ కమెడియన్ ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన అరెస్ట్ కూడా జరిగింది. ఆ ఘటన మరువకముందే.. అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. టిడిపి అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం మద్దతుదారులు హైదరాబాద్ కు చెందిన స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ కామెడీ షో ను అడ్డుకున్నారు. రెండేళ్ల కిందట చంద్రబాబుపై శరత్ ఉదయ్ చేసిన కామెడీ అభిమానుల్లో ఆగ్రహం నింపింది. ఇప్పుడు అదే శరత్ ఉదయ్ కామెడీ షో ను టిడిపి నేతలు అడ్డుకోవడం కూడా సంచలనంగా మారింది.
* నక్సలైట్ల దాడిని ఉదహరిస్తూ..
చంద్రబాబు( CM Chandrababu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003లో నక్సలైట్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు గాను వెళ్తున్న చంద్రబాబు వాహనంపై బాంబుతో దాడి చేశారు. క్లైమరా మైన్స్ పెట్టి వాహనాన్ని తేల్చే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో గాయాలతో బయటపడ్డారు చంద్రబాబు నాడు. అయితే స్టాండప్ కామెడీలో భాగంగా… రెండేళ్ల కిందట నక్సలైట్ల దాడిని ప్రస్తావిస్తూ శరత్ ఉదయ్ జోక్ చేశాడు. దీనిపై అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి డిమాండ్ మేరకు దానిపై అప్పట్లోనే శరత్ ఉదయ్ క్షమాపణలు చెప్పాడు. దీంతో అంతటితో ఆ వివాదం ముగిసిపోయిందని అంతా భావించారు.
* మరోసారి క్షమాపణ చెప్పించిన వైనం బెంగళూరులోని( Bangalore ) కోరమంగళ లో శనివారం రాత్రి 7 గంటల సమయంలో శరత్ ఉదయ్ స్టాండప్ కామెడీ షో ప్రారంభం అయింది. ఈ క్రమంలో ప్రేక్షకుల నుంచి ఓ వ్యక్తి శరత్వతయు వద్దకు చేరుకున్నాడు. తాను మీ అభిమాని నంటూ పరిచయం చేసుకున్నాడు. మీరు బాగా కామెడీ చేస్తారని.. అయితే ఒక షోలో తమ నాయకుడిని అవమానించారని అన్నారు. ఆ వెంటనే మరో ఇద్దరు వ్యక్తులు అతనితో చేరారు. శరత్ ఉదయ్ ను బెదిరించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారితో మరికొంతమంది చేరారు. అయితే అప్పట్లోనే తాను క్షమాపణలను కోరినట్లు శరత్ ఉదయ్ చెప్పారు. అయినా సరే వారు వినలేదు. చంద్రబాబుతో పాటు లోకేష్ కు ఆయనతో క్షమాపణలు చెప్పించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మా నాయకుడి పైనే జోకులు వేస్తావారా.. స్టాండప్ కమెడియన్ పై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు పై వేసిన జోకులకు స్టాండప్ కమెడియన్ షోని అడ్డుకుని బూతులతో దూషించిన టీడీపీ కార్యకర్తలు
బెంగళూరులో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనను అడ్డుకున్న… pic.twitter.com/FNGEvk9Hdn
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2026
