LSG Vs Kolkata Knight Riders: ఇది మామూలు దారుణం కాదు. ఘోరమైన ఓటమి.. విజయం దరిదాపుల్లోకి వచ్చిన తర్వాత ఓడిపోతే ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది.. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అభిమానుల పరిస్థితి కూడా ఇలానే ఉంది.
లక్నో జట్టు ఐపీఎల్ లో భాగంగా ఓడిపోయిన తీరు ఆ జట్టు అభిమానులకు తీవ్రమైన ఆవేదన కలిగిస్తోంది. వాస్తవానికి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో కచ్చితంగా లక్నో విజయం సాధించాలి. ఎందుకంటే తక్కువ స్కోరును చేదించడంలో లక్నో జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. ఒకానొక దశలో విజయం వైపు సాగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. చివరిలో తడబడింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు స్కోర్(155/7) కు సమానంగా పరుగులు చేసింది.
ఈ దశలో లక్నో జట్టు సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు దిగింది. సునీల్ నరైన్ వేసిన తొలి బంతికి నికోలస్ పూరన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి మార్క్రం ఔట్ అయ్యాడు. సూపర్ ఓవర్ పూర్తిస్థాయిలో ఆడకుండానే లక్నో జట్టు వెనుదిరిగింది. కేవలం రెండు పరుగుల టార్గెట్ ను కోల్ కతా ఎదుట ఉంచింది.. తొలి బంతికే కోల్ కతా ఆటగాడు రింకూ సింగ్ ఫోర్ కొట్టి.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ను గెలిపించాడు.
లక్నో జట్టు ఓటమికి నికోలస్ పూరన్ కారణమని ఆ జట్టు అభిమానులు ఆరోపిస్తున్నారు. అతడిని లక్నో జట్టు యాజమాన్యం 21 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతవరకు ఒక్క ఇన్నింగ్స్ కూడా అతడు సరిగ్గా ఆడ లేకపోయాడు. కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయాడు. గొప్పగా ఆడతాడని కొనుగోలు చేసిన ఈ ఆటగాడు.. ఇలా విఫలం కావడం లక్నో జట్టు యాజమాన్యాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఈ ఓటమితో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉంది.
