RK Kotha Paluku: పాత్రికేయం కూడా వ్యాపారం అయిపోయింది. ఇక తెలుగు నాటయితే వ్యాపారులే పాత్రికేయంలోకి వస్తున్నారు. పాత్రికేయంలోకి వ్యాపారులు వచ్చినప్పుడు కచ్చితంగా లెక్కలు వేసుకుంటారు. లెక్కలు మాత్రమే చూసుకుంటారు. ఇప్పటిక తెలుగులో పాత్రికేయుడు నడిపిస్తున్న పత్రిక ఆంధ్రజ్యోతి.. అఫ్కోర్స్ ఒకప్పుడు ఆంధ్రజ్యోతి ఇబ్బందుల్లో నడిచేది.ఇప్పుడు అంతకుమించి అనే స్థాయికి చేరుకుంది. ఇది ఎలా సాధ్యమైంది? అనుకూలంగా ఎలా మలుచుకుంది? అనే ప్రశ్నలను పక్కన పెడితే.. ఇక్కడిదాకా ఎదగడం.. ఈ స్థాయిలో ఆర్థికంగా నిలబడడం మామూలు విషయం కాదు. ఆ కిటుకు ఏమిటో రాధాకృష్ణ బయటకి చెప్పాడు. చెప్పలేడు కూడా. సరే ఆ లోతుల్లోకి వెళ్లడం పక్కన పెడితే.. ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరు మీద వర్తమాన రాజకీయ అంశాల మీద రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేస్తుంటారు. ఇక ఈ ఆదివారం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై తనదైన మార్క్ విశ్లేషణ చేశారు.
ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడుని గొప్ప రాజకీయ నాయకుడిగా రాధాకృష్ణ అభివర్ణించారు. జాతీయ పార్టీ అధ్యక్షస్థానాన్ని లోకేష్ కు ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ఇక ఆలస్యం చేయకూడదని.. చంద్రబాబు నాయుడుకి వయసు మీద పడుతోందని.. కాకపోతే ఆయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. అన్ని బాగున్నప్పుడే లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని రాధాకృష్ణ రాసుకొచ్చారు.. రాధాకృష్ణ రాజకీయంగా రాటు తేలిపోయాడని.. తన తండ్రి లాగా మొహమాటం పడడం లేదని.. ఏదైనా సరే ఓపెన్ గానే చెప్పేస్తున్నాడని.. ఇక టిడిపి భవిష్యత్తు మొత్తం లోకేష్ మీద ఆధారపడి ఉందని.. వచ్చే కాలాన్ని సైతం ఊహించి రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ వచ్చి పార్టీని హైజాక్ చేస్తాడో.. ఎక్కడ పార్టీ ముక్కలవుతున్నానని ముందుగానే భావించిన రాధాకృష్ణ.. నాయకత్వాన్ని డిసైడ్ చేశాడు. గతంలో ఇదే రాధాకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ కు ఏదో విషయంలో విభేదాలు చోటుచేసుకున్నాయని.. అప్పటినుంచే రాధాకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అంటే కాస్త ఏవగింపు ప్రదర్శిస్తాడని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరిగింది. అయితే దీనిపై అటు జూనియర్ ఎన్టీఆర్ గానీ.. ఇటు రాధాకృష్ణగాని క్లారిటీ ఇవ్వలేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది.. వాళ్ళిద్దరి మధ్యే ఎందుకు వివాదం చోటుచేసుకుంది అనేది ఇప్పటికి తెలియ రాలేదు. కాకపోతే మనసులో ఈ విషయాన్ని కూడా పెట్టుకోకుండా ఓపెన్ గా చెప్పడం రాధాకృష్ణ స్టైల్ కాబట్టి.. జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న ఆకాశ కోపాన్ని తన రాతల్లో ప్రదర్శించాడు. టిడిపికి భవిష్యత్తు నారా లోకేష్ అని ఓపెన్ గానే చెప్పేశాడు.
తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే.. గులాబీ సుప్రీం కుమార్తె, కుమారుడి మధ్య జరుగుతున్న విభేదాల గురించి అసలైన విషయాలు చెప్పాడు రాధాకృష్ణ. చెల్లికి, అన్నకి విభేదాలు ఉన్నాయని.. ఇప్పట్లో అవి తేలిపోవని.. మొత్తానికి పార్టీలో తనస్థితి ఏమిటో చెప్పాలని గులాబీ సుప్రీం కూతురు ప్రశ్నిస్తోందని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితి టిడిపిలో ఒకవేళ ఉంటే రాధాకృష్ణ ఇలా రాసేవాడా? గులాబీ సుప్రీం కూతురును ప్రశ్నించినట్టే.. అతడిని కూడా క్వశ్చన్ చేసేవాడా? ఈ ప్రశ్నలకు మిగతా వారి కంటే రాధాకృష్ణ సమాధానం చెప్తేనే బాగుంటుంది.. ఆయన ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టు.. పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగా ఉంటే బాగుంటుంది. ఒక రాజకీయ పార్టీకి గొడుగు పట్టి భజన చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమయినంత.