Ys Jagan mohan reddy : వైసీపీకి వివాహేతర సంబంధాలు కుదిపేస్తున్నాయి. పార్టీ ఓటమి అనంతరం ఒక్కో నేత బాగోతం బయటపడుతోంది. తొలుత విజయసాయిరెడ్డి వ్యవహారం సంచలనం రేకెత్తించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుటుంబ వివాదంలో విజయసాయిరెడ్డి పేరు వినిపించింది. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలంటూ శాంతి భర్త డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి పై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియాలో దీనిపై కథనాలు వచ్చాయి. మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి దీనిని కొంతమంది చేసిన కుట్రగా అభివర్ణించారు. తరువాత ఆయన మాయమయ్యారు. అయితే దీనిపై డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధం కావాలని శాంతి భర్త సవాల్ చేసిన విజయసాయి పట్టించుకోలేదు. ఆ ఎపిసోడ్ మరువకముందే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం బయటకు వచ్చింది. గత నాలుగు రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. ఓ మహిళతో దువ్వాడ సహజీవనం చేస్తున్నారన్నది ఆరోపణ. గత మూడేళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా బయటకు రాలేదు. కానీ వైసీపీ ఓడిపోయిన తరువాత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఆ మహిళతో బహిరంగంగానే తిరుగుతుండడంతో.. భార్య, ఇద్దరు పిల్లలు దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రగడ చోటు చేసుకుంది. పెను వివాదానికి దారితీసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే త్వరలో వైసిపి పెద్ద నేతల రాసలీలలు బయటకు రానున్నాయని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సీమ రాజా బాంబు పేల్చారు. ఏకంగా వైసీపీ అధినేత జగన్ రాసలీలలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. త్వరలో అవి బయటకు వస్తాయని కూడా ప్రకటించారు. దీంతో తెలుగు నాట ఇదో హాట్ టాపిక్ గా మారింది.
* సీమ రాజా చాలా ఫేమస్
సీమ రాజా పేరిట యూట్యూబ్ ఛానల్ లో హల్చల్ చేస్తుంటారు. మెడలో వైసీపీ కండువా వేసి.. తాను ఒక వైసీపీ నేతగా చెబుతుంటారు. పార్టీ విధానాలను ప్రస్తావిస్తూ.. వాటిని పొగిడినట్టే చెబుతూ.. అందులో లోపాలను ఎత్తిచూపుతారు సీమ రాజా.ఎన్నికలకు ముందు నుంచే సీమవైసీపీకి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా గళం ఎత్తారు. వైసీపీ శ్రేణుల నుంచి బెదిరింపులు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. మా బాబాయిని మేము హత్య చేసుకుంటాం.. మీరెవరు అంటూ సెటైరికల్ గా మాట్లాడారు.చాలా అంశాల్లో వైసీపీని ఇరుకున పెట్టారు.చివరకు వైసీపీ అధికారికంగా ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. సీమ రాజాకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటన దాని సారాంశం.
* త్వరలో అన్న రాసలీలలు
అయితే తాజాగా సీమ రాజా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడారు. సీఎం జగన్ ఎక్కడికి వెళ్లారని యాంకర్ ప్రశ్నిస్తే.. నీకెందుకులే అంటూ సెటైరికల్ గా సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. బెంగళూరు తరచూ వెళ్తుండడాన్ని ప్రస్తావిస్తూ.. త్వరలో జగన్ అన్న రాసలీలలు బయట వస్తాయని.. అతి త్వరలో వెలుగు చూస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఆ రాసలీలలు చూసి తెలుగు ప్రజలు షేక్ అవుతారని కూడాసీమ రాజా ప్రకటించారు.అయితే ఇప్పటివరకు సీమ రాజా ప్రకటించినవి వైసీపీలో వెలుగు చూశాయి.ఇప్పుడు కూడా జగన్ పేరుతో చేసిన ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది ఎంతవరకు వెళుతుందోనని వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నాయి.
Seema Raja:- త్వరలో వైస్ జగన్ రాసలీలలు బయటపడనున్నాయి…#Seemaraja #BreakingNews #YSJagan #News #APNews pic.twitter.com/fdwIqWdsDC
— OK Media Updates (@OkmediaUpdates) August 11, 2024
* వైసీపీపై వ్యతిరేక ప్రచారం
సీమ రాజా వైసిపికి చాలా రకాలుగా నష్టం చేశారు. తన యూట్యూబ్ ఛానల్ లో వైసీపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమైనా విడిచిపెట్టడం లేదు. తనది రాయలసీమ అని చెప్పుకునే సీమ రాజా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమకాలీన రాజకీయ అంశాలు అంటే.. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగానే వీడియోలు విడుదల చేస్తుంటారు. ప్రస్తుతం వైసీపీ నేతలు వివాహేతర సంబంధాల్లో ఇరుక్కున్న నేపథ్యంలో.. అదే తరహా ఆరోపణలు చేశారు. ఏకంగా సీఎం జగన్ పై గురిపెట్టారు. మరి ఆయన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More