Davos Investments AP : ఎట్టకేలకు దావోస్( davos) పర్యటన ముగిసింది. ఏపీ నుంచి వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం తిరుగు ముఖం పట్టింది. అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు చంద్రబాబు. కానీ ఏపీకి ఎంత పెట్టుబడులు వచ్చాయో మాత్రం చెప్పలేదు. ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు బయట పెట్టలేదు. హడావిడి మాత్రం నడిచింది. తెగ ఆర్భాటం కూడా చేశారు. అయితే ఒక్క ఒప్పందం కూడా చేసుకోకపోవడం ఏపీకి మైనస్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున విమర్శలు ప్రారంభమయ్యాయి. ఏపీని తెలంగాణతో పోల్చుతూ.. ఏంటి ఈ దుస్థితి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు.. మనవి కట్టు కథలు అన్నట్టు ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఇదే హైలెట్ అవుతోంది. సందట్లో సడే మియా అన్నట్టు టిడిపి అనుకూల పత్రికలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్యానర్గా వచ్చిన కథనాలు చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ఎడిషన్లో దావోస్ ధమాకా అనే శీర్షికతో భారీ కథనం వచ్చింది. దుమ్మురేపిన తెలంగాణ బృందం.. 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ రాసుకొచ్చారు. అదే ఆంధ్ర ఎడిషన్ లో మాత్రం మళ్లీ ఏపీ బ్రాండ్ అని మాత్రమే ముగించారు.
* బయటపడని ఒప్పందాలు
అసలు దావోస్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం( AP government ) చేసుకున్న ఒప్పందాలు బయట పెట్టలేదు. ఎన్ని పెట్టుబడులు సాధించారో గణాంకాలు వెల్లడించలేదు. కానీ దావోస్ పర్యటన అంటూ ఆర్భాటం చేశారు. దీనికి గాను ప్రకటనలు, కథనాలకు ఖర్చుకు ఏకంగా కోట్లాది రూపాయలు కేటాయించారు. అనుకూల మీడియాలో ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు అంటూ ఫొటోలతో ప్రచారం చేసుకున్నారు. కానీ కేవలం మూడు రోజుల పాటు ఏపీకి పెట్టుబడులతో రావాలని మాత్రమే చెప్పడానికి సరిపెట్టారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా తెలంగాణ సీఎం రేవంత్ తో పాటు ప్రతినిధులు వెళ్లారు. గుట్టుగా పెట్టుబడులు సాధించుకొని ముందుకు వచ్చారు. కానీ ఏపీ విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
* ఒప్పందాలపై సస్పెన్స్
అయితే ఇంత చేసి ఒప్పందాలు చేసుకోకపోవడం ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. వైసీపీ( YSR Congress ) హయాంలో జగన్ దావోస్ పర్యటనకు వెళ్తే చాలు.. చంద్రబాబు విరుచుకుపడేవారు. టిడిపి అనుకూల మీడియా అయితే ఓ రేంజ్ లో కథనాలు ప్రచురించేది. జగన్ చర్చిస్తే వారు స్వదేశీ పారిశ్రామికవేత్తలు, అస్మదీయ పారిశ్రామికవేత్తలు. అదే చంద్రబాబు చర్చిస్తే మాత్రం వారు మహనీయులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు అన్నట్టు చూపిస్తోంది ఎల్లో మీడియా. ఇప్పుడు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు.. ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు అంటే మాత్రం నోరు వెళ్ళబెడుతోంది.
* కూటమిలో నిరాశ
అయితే పెద్దగా ఒప్పందాలు జరగకపోవడంతో నిరాశతో వెనుదిరిగింది ఏపీ బృందం( AP team ). దీనిపై కూటమి పార్టీల్లో సైతం నిరాశ వ్యక్తం అవుతోంది. ఇంత దానికి ఆర్భాటం చేయడం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా దీనినే హైలైట్ చేస్తోంది. అటు విశ్లేషకులు సైతం ఏపీ బృందం పెట్టుబడుల వేటలో విఫలమైనట్లు విశ్లేషణలు చెబుతున్నారు. మొత్తానికైతే దావోస్ పర్యటన ఏపీకి డిజాస్టర్ గా మారిందన్న టాక్ వినిపిస్తోంది.
జగన్ మీద పగతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా నాశనం చేశాడు pic.twitter.com/nyTFWKbpR6
— Graduate Adda (@GraduateAdda) January 24, 2025