Social Media Arrests AP: ఏపీలో( Andhra Pradesh) మళ్లీ సోషల్ మీడియా వార్ రగులుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని.. విధ్వంసాలు రేపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం ప్రారంభించారు. రోజులవ్యవధిలోని వందలాది కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులతో వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియాను హ్యాండిల్ చేసే సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ కూడా జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. సోషల్ మీడియా అరెస్టులు జరగడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపణలు ప్రారంభించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు పూర్తిచేసిన ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. అయితే తాజాగా వైసిపి సోషల్ మీడియా మళ్లీ రెచ్చిపోతోంది. దీంతో పోలీసులు కేసుల నమోదుకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
* కేసులు నమోదు..
తాజాగా సీఎం చంద్రబాబు( CM Chandrababu), కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా నడిచాయి. మొన్న ఆ మధ్యన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేయడం ద్వారా వ్యతిరేక ప్రచారం చేశారు. టిడిపి మహిళా నేతలను కించపరచడం ప్రారంభించారు. ఏకంగా రాష్ట్ర హోం మంత్రి మీదే అసభ్య వ్యాఖ్యలు చేయడం వంటివి ఇటీవల పెరిగిపోయాయి. అయితే చూసి చూడనట్టుగా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా స్పందించింది. అలాంటి వాటిని కట్టడి చేయాలని పోలీసులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. ఇందుకు ప్రత్యేక చట్టం కూడా తీసుకురానుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
* వైసీపీలో అదే ధీమా..
ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయిందని.. ఇక అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేనిని జగన్మోహన్ రెడ్డి ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా డిజిటల్ బుక్ ను ఓపెన్ చేశారు. అదే సమయంలో సోషల్ మీడియాకు సైతం కీలక టాస్క్ ఇచ్చారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడ్ని రంగంలోకిందించారు. అయితే తనపై నిఘా ఉండడంతో సజ్జల భార్గవరెడ్డి కేసులు ఎదురుకాకుండా పరోక్షంగా డీల్ చేస్తున్నారు. పార్టీ అంటే విపరీతమైన అభిమానాన్ని చూపే సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎంపిక చేస్తున్నారు. వారిని పూర్తిస్థాయిలో ఉపయోగించేందుకు ప్లాన్ చేశారు. విదేశాల్లో ఉన్నవారికి సైతం ఆఫర్లు చేశారు. కానీ వారు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలోనే సోషల్ మీడియా సైనికులను రంగంలోకి దించారు. మొత్తం కంటెంట్ అంతా వైసిపి ఆఫీసు నుంచి వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే భావ స్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరి విస్తృతం అవుతోంది. విశేషమేమిటంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. అటువంటి వారిపై కేసులు నమోదు కావడం.. వైసిపి నాయకత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పరివర్తన వచ్చింది. అందుకే వారు ఆ జోలికి పోవడం లేదు. ఇప్పుడు కొత్త వారితో ఆ పని చేయిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రమాదకర క్రీడలు ఇంకా ఎంతమంది బలవుతారోనన్న చర్చ అయితే నడుస్తోంది