Balakrishna: నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) క్షమాపణలు చెబుతారా? అసెంబ్లీలో జరిగిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారా? మెగా అభిమానుల డిమాండ్ కు తల ఉంచుతారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. రెండు రోజుల కిందట నందమూరి బాలకృష్ణ అప్పటి పరిణామాలపై మాట్లాడారు. చిరంజీవి ప్రస్తావన తీస్తూ జగన్ పై వెటకారంగా మాట్లాడారు. ఇది మెగా అభిమానులకు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈరోజు హైదరాబాదులో మెగా అభిమాన సంఘాలు ప్రత్యేకంగా సమావేశం అవుతాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో బాలకృష్ణ క్షమాపణలు చెబుతారా? అంటే అది అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు.
* గతంలో చాలాసార్లు..
గతంలో బాలకృష్ణ చాలా సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. తమ బ్రీడు, సినీ పరిశ్రమలో( cine industry) తాము వేరని అభిప్రాయపడేవారు. బాలకృష్ణ చులకనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణను ఉద్దేశించి చాలా రకాలుగా మాట్లాడారు. బాలయ్య ఎవరు? పాత సినిమాల్లో కమెడియనా? అని వింతగా ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాన్ సన్ హౌస్ ప్రస్తావన తీసుకొచ్చి సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతమాత్రాన నాగబాబు క్షమాపణ చెప్పారా? లేకుంటే బాలయ్య తప్పు చేశానని ఒప్పుకున్నారా? కనీసం ఏదీ జరగలేదు. కార్యక్రమంలో అందరూ కలుసుకున్నారు. ఒకరి గొప్పతనాన్ని ఒకరు చెప్పుకున్నారు. బాలయ్య అంతే.. చిన్నపిల్లాడి మనస్తత్వం అని తేల్చి పారేసిన పరిస్థితులు ఉన్నాయి. మెగా కుటుంబం గొప్పదని బాలకృష్ణ కితాబు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. కానీ కొద్ది కాలానికి వారంతా కలిసి పోతారు.. ఇది సాధారణ విషయం అని చాలామంది గుర్తించరు.
* జనసేన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు? చిరంజీవికి( megastar Chiranjeevi) అవమానం జరిగింది అనేది ఆయన అభిమానుల బాధ. చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఎగతాళిగా మాట్లాడారు అనేది వారి వాదన. కానీ సభలో జన సేన ఎమ్మెల్యేలు 21 మంది ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా దానిని రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేయలేదు. అయితే అలా డిమాండ్ చేయడానికి కూడా అందులో ఏమీ లేదు. చిరంజీవి విషయంలో బాలకృష్ణ బూతు పదం వాడలేదు. నిషేధ వ్యాఖ్య చేయలేదు. అప్పటి పరిణామాలను చెబుతూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో గాడు అన్నారు. కానీ తన ప్రస్తావన వచ్చేసరికి చిరంజీవి స్పందించాల్సి వచ్చింది. ఆయన ప్రత్యేక ప్రకటన ఇచ్చి దీనిపై క్లారిటీ ఇచ్చారు. కానీ మెగా అభిమానులకు కొందరు అతిగా వ్యవహరిస్తున్నారు. మెగా అభిమానుల ముసుగులో రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చూస్తున్నారు. ఈ విషయాన్ని నిజమైన మెగా అభిమానులు గుర్తించాలి. బాలకృష్ణను క్షమాపణ చెప్పాలని కోరడం కాస్త అతి. ఈ విషయంలో క్షమాపణలు ఉండవు. మరి కొద్ది రోజుల్లో వారంతా ఇట్టే కలిసి పోతారు. గతంలో జరిగింది. ఇప్పుడు కూడా జరగబోతోంది అదే.