Allu Sneha Reddy : ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాడనే చెప్పాలి. పుష్ప 2 సినిమా రిలీజ్ అయి భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి ఆయనకు మాత్రం ఏ రకంగా సంతోషమైతే లేదు. ఇక తన వల్ల ఒక అభిమాని చనిపోయిందని ఆయన బాధపడుతున్న క్రమంలో ఆయన మీద కొన్ని కేసులు నమోదు చేయడమే కాకుండా అతన్ని ఈరోజు జైలుకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరు పరిచారు. ఇక న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ ను విధించింది. మరి ఈ రిమాండ్ తర్వాత అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నాడు. ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్లబోతుంది ఒకవేళ ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలు పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే ఆయనకు శిక్ష పడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ కి ఇప్పుడు అనుకోని దెబ్బ తగలడం అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కలచివేస్తుందనే చెప్పాలి…ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కోసం పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీలు స్పందిస్తున్న సమయాన ఆయన భార్య అయిన స్నేహలత రెడ్డి ఇప్పటికే వైసిపి పార్టీ అధినేత అయిన జగనన్న తో ఫోన్ లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు పట్ల ఆమె తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే జగనన్న మాత్రం స్నేహలత ను ఓదారుస్తూ అతనికి ఏమీ అవ్వదని ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇక అందులో భాగంగానే తన తరపు న్యాయవాదులను అయినా నిరంజన్ రెడ్డి, అశోక రెడ్డి లను అల్లు అర్జున్ తరపున న్యాయవాదులుగా నియమించి ఎలాగైనా సరే అల్లు అర్జున్ కి ఆ కేసు కు ఎలాంటి సంబంధం లేదనే విధంగా కేసును ప్రూవ్ చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇక అందుకే వాళ్ళు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులుగా ఉండటమే కాకుండా కోర్టులో చాలా స్ట్రాంగ్ గా వాదించారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉందనే ఉద్దేశ్యంతో న్యాయమూర్తి 14 రోజులపాటు అల్లు అర్జున్ కు రిమాండ్ అయితే విధించారు…
ఇక అల్లు అర్జున్ భార్య అయిన స్నేహలత రెడ్డి జగనన్నతో మాట్లాడడం అనేది చాలా వరకు కలిసి వచ్చిందని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా వైసిపి పార్టీ నాయకులు ప్రస్తుతం అల్లు అర్జున్ కి టచ్ లో ఉంటున్నారనే చెప్పాలి.