Homeఆంధ్రప్రదేశ్‌AP Smart Meters: స్మార్ట్ విద్యుత్ మీటర్ల బిగింపు.. ఏపీలో తిరగబడుతున్న జనం!

AP Smart Meters: స్మార్ట్ విద్యుత్ మీటర్ల బిగింపు.. ఏపీలో తిరగబడుతున్న జనం!

AP Smart Meters: అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు(electrical charges) పెంచమని చెప్పుకొచ్చారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి హయాంలో స్మార్ట్ మీటర్లు పెడితే వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కంపెనీకి స్మార్ట్ ఎలక్ట్రికల్ మీటర్ల అమర్చే బాధ్యత అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలియకుండానే విద్యుత్ చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగింపునకు ప్రయత్నిస్తుండడంతో జనం తిరగబడుతున్నారు. స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు వెళ్తున్న సిబ్బందికి ప్రజల నుంచి షాక్ తప్పడం లేదు. ఎక్కడికక్కడే జనం నిలదీసి వెనక్కి పంపుతున్నారు. దీంతో స్మార్ట్ మీటర్ల అంశం వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.

రీఛార్జ్ చేసుకుంటేనే..
ఇప్పటివరకు సెల్ ఫోన్, టీవీలకు సంబంధించి రీఛార్జ్ చేసుకోవడం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు( smart metres ) సైతం అదే తరహాలో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత విద్యుత్ వినియోగిస్తామో.. అంతే బిల్లు వస్తుంది. రీఛార్జ్ నగదు మొత్తం అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అంటే రాయితీ విద్యుత్ కు మంగళం పలికినట్టే. అందుకే ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు నిర్ణయించారు. అప్పట్లో దీనిని వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు గృహ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి సైతం స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ఆదాని కంపెనీతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం అయింది. కానీ ఎక్కడికక్కడే జనం నిలదీస్తున్న వైనంపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన జగన్!

మీటర్లలో అనేక మార్పులు..
విద్యుత్ మీటర్లలో దశాబ్దాల కాలంలో అనేక మార్పులు సంభవించాయి. గతంలో కూడా మీటర్లు అమర్చారు. గతంలో సాంప్రదాయక ఎనర్జీ లేక ఎలక్ట్రా మెకానికల్ డివైస్ మీటర్లు ( Electra mechanical device metres )ఉండేవి. వాటి స్థానంలో 15 ఏళ్ల కిందట ఎలక్ట్రానిక్ డిజిటల్ మీటర్లు బిగించారు. విద్యుత్ బిల్లులో డిస్మల్ పాయింట్ తో సహా లెక్కించే మీటర్లు అవి. వాడుకున్న కరెంటుకు పూర్తిగా లెక్కించి ఖచ్చితమైన బిల్లు వచ్చే విధంగా తయారు చేయబడ్డాయి. అటువంటి మీటర్ల స్థానంలో ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. కచ్చితంగా ఇప్పటివరకు విద్యుత్ బిల్లులను అవి చూపిస్తున్నాయి. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్ ద్వారా అదాని కంపెనీకి లాభం చేకూర్చే ప్రయత్నం అంటూ అనుమానాలు ఉన్నాయి. కాల పరిమితి లేకుండా సేవలు అందిస్తున్న ఎలక్ట్రానిక్ డిజిటల్ మీటర్లను కాదని.. ప్రతి ఎనిమిది సంవత్సరాల కు మార్చాల్సిన స్మార్ట్ మీటర్లను అమర్చాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది ప్రజా సంఘాల వాదన. మన ఇంట్లో మీటర్లను అదాని ఆఫీస్ నుంచి కంట్రోల్ చేసే హక్కు కల్పించడం ఏమిటనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట.

ఆ వెసులబాటు లేకుండా
సాధారణంగా విద్యుత్ వినియోగం నెల రోజులు జరిగిన తరువాత.. మరో 18 రోజులు బిల్లు కట్టేందుకు గడువు ఉంటుంది. అప్పటికి కట్టకుంటే అపరాధ రుసుము ద్వారా చెల్లించే అవకాశం ఉండేది. కానీ ఈ స్మార్ట్ మీటర్లలో అలాంటి అవకాశం ఉండదు. వాటిలో సిమ్ కార్డు వంటి ద్వారా ఇకపై ముందే డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలి. ఎప్పుడు డబ్బులు అయిపోతే ఆ క్షణం విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అదా నీ ప్రైవేట్ సంస్థ వీటిని నియంత్రిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల జుట్టును అదా నీ చేతిలో పెట్టినట్టేనని టాక్. అందుకే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే ప్రభుత్వ విధానం పుణ్యమా అని విద్యుత్ శాఖ దిగువ స్థాయి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version