Singayya Death Case: పల్నాడు( Palanadu) జిల్లాలో జగన్ పర్యటనకు సంబంధించి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటనలో భాగంగా సింగయ్య అనే వృద్ధుడితోపాటు జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు కూడా మృతి చెందాడు. జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి సింగయ్య మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గుండెపోటుకు గురైన జయవర్ధన్ రెడ్డి కి సరైన వైద్య సేవలు అందడంలో ఆలస్యం జరిగిందని.. అందుకు జగన్ కాన్వాయ్ కారణమని ఆరోపణలు వినిపించాయి. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే విషయం. అయితే అనూహ్యంగా ఆ ఇరు బాధిత కుటుంబాలు అడ్డం తిరిగాయి. తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. ఇప్పుడు ఇది అత్యంత హాట్ టాపిక్ గా మారుతోంది. దీని వెనుక చాలా రకాల అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read: జగన్ పై వాహన ప్రమాద కేసులో చర్యలన్నీ నిలిపేసిన కోర్టు
* వివాదాస్పద కేసుగా
Singayya Death Case కొద్ది రోజుల కిందట జగన్( Y S Jagan Mohan Reddy ) పల్నాడు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఓ వైసిపి నేత విగ్రహ ఆవిష్కరణకు గాను ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో సింగయ్య అనే వృద్ధుడు జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి మృతి చెందాడు అన్నది ఓ వీడియోలో వెలుగు చూసింది. దీంతో పోలీసులు జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఆయనను ఈ కేసులో ఏ2 నిందితుడిగా చేర్చారు. ఆయన వాహనాన్ని సైతం సీజ్ చేశారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదని అంతా భావించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డిని కలవడం విశేషం. ఇప్పటికే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల సాయం అందించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన భార్య నేరుగా జగన్మోహన్ రెడ్డికి వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు. అందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠను పెంచారు.
* టిడిపి మనుషులు ఒత్తిడి చేశారా
అయితే సింగయ్య( singaiya ) భార్య నేరుగా లోకేష్ ప్రస్తావన తీసుకురావడం వెనుక చాలా రకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్రమాదం తర్వాత తన భర్త సింగయ్య మాట్లాడారని.. తన పేరుతో పాటు ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పారని ఆమె చెబుతున్నారు. అంబులెన్స్ లో ఏదో జరిగిందని మాత్రం అనుమానిస్తున్నారు. అంతటితో ఆగని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తన వద్దకు నారా లోకేష్ 50 మంది టిడిపి మనుషులను పంపారని.. మీ కులస్తుల మేనని నమ్మబలికారని చెబుతున్నారు. అయితే ఆమె చిన్న లాజిక్ మిస్ అయ్యారు. సింగయ్య ఏ వాహనం కిందపడి మృతి చెందాడు అన్నది మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సైతం ప్రైవేట్ వాహనంలో అత్యవసరంగా తీసుకెళ్లకుండా.. అంబులెన్స్ వచ్చేవరకు వేచి ఉన్నారని చెప్పుకొచ్చారు.
* ప్రమాదానికి కారణం ఏ వాహనం?
వాస్తవానికి సింగయ్య జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కిందపడి మృతి చెందాడన్న విషయాన్ని ఆయన భార్య చెప్పడం లేదు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది తెలియడం లేదు. ప్రమాదం అన్నాక పొరపాటున జరిగి ఉండవచ్చు. గానీ దానిని బయట పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సాహసించడం లేదు. సింగయ్య భార్య సైతం తన భర్త ఏ వాహనం కిందపడి ప్రమాదానికి గురయ్యారో చెప్పడం లేదు. నేరుగా ఆమె లోకేష్ పై( Nara Lokesh) విమర్శలు చేస్తుండడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక తప్పకుండా రాజకీయ కోణం ఉందని స్పష్టమవుతోంది. అయితే ఒక్క మాట మాత్రం నిజం. చనిపోయిన సింగయ్య వైసీపీకి అభిమాని. జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. మరి ఆ కుటుంబాలు ఎలా మాట్లాడుతాయో అందరికీ తెలిసిన విషయమే..