Chiranjeevi Film: శ్రీదేవి-చిరంజీవి(CHIRANJEEVI) అనగానే జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి క్లాసిక్ గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు నిర్మాతగా స్వయంగా శ్రీదేవి వ్యవహరించింది. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అందుకు కారణాలు ఏమిటో చూద్దాం..
చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన శ్రీదేవి అనంతరం హీరోయిన్ గా మారింది. శ్రీదేవి(SRIDEVI) అందం, నటన ఆమెను అనతికాలంలో స్టార్ ని చేశాయి. ఎన్టీఆర్(NTR),ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ పదుల సంఖ్యలో శ్రీదేవితో చిత్రాలు చేశారు. ఆ తరువాతి తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సైతం శ్రీదేవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం. అప్పటికే బాలీవుడ్ లో శ్రీదేవి బిజీ కావడంతో చిరంజీవి, నాగార్జున, వెంకీలతో తక్కువ చిత్రాలు మాత్రమే చేసింది. ఇక చిరంజీవితో ఆమె జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురాం, మోసగాడు వంటి చిత్రాల్లో జతకట్టింది.
Also Read: దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ మూవీ..స్టోరీ లైన్ వింటే మెంటలెక్కపోతారు!
దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన జగదేకవీరుడు అతిలోకసుందరి(JAGADEKAVEERUDU ATHILOKASUNDARI) టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసింది. మానవుడితో ప్రేమలో పడే దేవకన్యగా శ్రీదేవి నటించింది. ఇంద్రుడి కూతురిగా శ్రీదేవి నిజమైన దేవకన్యను తలపించింది. దర్శకుడు శ్రీదేవిని చాలా అందంగా ప్రెజెంట్ చేశాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. శ్రీదేవి-చిరంజీవి కాంబో మీద జనాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీన్ని క్యాష్ చేసుకోవాలని, మరో చిత్రం వీరి కాంబోలో ప్లాన్ చేశారు. ఈ సినిమాకు వజ్రాల దొంగ అనే టైటిల్ నిర్ణయించారు. శ్రీదేవి తొలిసారి నిర్మాతగా వజ్రాల దొంగ చిత్రంతో మారింది.
ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. చిరంజీవి-శ్రీదేవి-ఏ. కోదండరామిరెడ్డి కాంబోలో చిత్రం అనగానే అంచనాలు పీక్స్ కి చేరాయి. చిత్రీకరణ దశలోనే ఈ సినిమా హక్కుల కోసం బయ్యర్లు ఎగబడ్డారు. ఓ సాంగ్ చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ప్రేక్షకుల అంచనాలు అందుకునే రేంజ్ లో కథ లేదనే సందేహాలు మొదలయ్యాయి. ఈ కారణంగా వజ్రాల దొంగ మూవీని ఓ పాట చిత్రీకరణ అనంతరం ఆపేశారు. మరో కథతో సేమ్ కాంబోలో సినిమా చేయాలని అనుకున్నారు.
Also Read: విశ్వక్ సేన్ చిత్రంలో బాలయ్య..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్!
హిందీలో భారీ విజయం సాధించిన మిస్టర్ ఇండియా చిత్రాన్ని రీమేక్ చేద్దామని శ్రీదేవి అన్నారు. ఆ కథ చిరంజీవి నచ్చలేదట. జగదేకవీరుడు అతిలోక సుందరి రేంజ్ కథ దొరక్క, చిరంజీవి చిత్రంతో నిర్మాతగా మారాలన్న శ్రీదేవి కోరిక తీరలేదు. మొదటి ప్రయత్నమే సఫలం కాకపోవడంతో శ్రీదేవి నిర్మాత అవ్వాలన్న కోరికకు గుడ్ బై చెప్పిందట. బాలీవుడ్ లో స్టార్ కావడంతో నటిగా వరుస చిత్రాలు చేస్తూ, పూర్తిగా సౌత్ కి ఆమె దూరమయ్యారు.