సింహాచలం( Simhachalam) ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. చందనోత్సవం సందర్భంగా క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. చందనోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లలో వేచి ఉన్నారు. అదే సమయంలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులకు గోడ కూలిపోయింది. అయితే ఈ ఘటన సంచలనం గా మారింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కూలిన గోడ నిర్మాణంలో నాణ్యత లేదని తేలిపోయింది. పునాది లేకుండానే నాసిరకం పనులు చేశారని విచారణ కమిటీ గుర్తించింది.
Also Read : అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి!
* కాంట్రాక్టర్ నుంచి వివరాలు సేకరణ..
ఈ ఘటన విచారణకు సంబంధించి ప్రత్యేక కమిటీని( special enquiry committee ) నియమించారు. ఆ కమిటీ బృందం ఈరోజు దర్యాప్తు ప్రారంభించింది. సంబంధిత పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ లక్ష్మణరావును విచారించింది. ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. తనపై దేవాదాయ శాఖ అధికారులు ఒత్తిడి చేసినట్లు చెప్పుకొచ్చారు. చందనోత్సవానికి సమయం తక్కువ ఉంది. తాను గోడ కట్టనని తేల్చి చెప్పినట్లు చెప్పారు. అయితే దేవాదాయ శాఖ తో పాటు పర్యాటక శాఖ అధికారులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అందుకే గోడ కట్టినట్లు వివరించారు. ఇప్పుడు కాంట్రాక్టర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
* నాలుగు రోజుల కిందట నిర్మాణం.. చందనోత్సవం( chandanotsavam) సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ఉచిత క్యూ లైన్లతోపాటు 300 రూపాయలకు సంబంధించి దర్శన టికెట్లను సైతం విక్రయించారు. సింహాచలం కాంప్లెక్స్ పక్కన ఉండే క్యూ లైన్ ను 300 రూపాయల టికెట్ల దర్శనం కోసం కేటాయించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద.. రక్షణ గోడను నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణం నాలుగు రోజుల కిందటే పూర్తయింది. ఇంతలోనే గోడ కూలిపోయింది. 8 పంది ప్రాణాలను హరించింది. బలమైన పునాదులు లేకుండా.. కాంక్రీట్ ఇటుకులతో నిర్మించినట్లు తేలింది.
* ఓ ఇంజనీర్ నిర్లక్ష్యం..
అయితే టూరిజం లో( tourism department) డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఒక ఇంజనీర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా విచారణ బృందం ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా గోడ కుప్ప కూలింది. భక్తుల పైకి సిమెంట్ ఇటుకలు పిడుగుల పడ్డాయి. మట్టి కూడా ముంచెత్తింది. చిమ్మ చీకటి ఆపై వర్షం.. చీకటిలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎనిమిది మంది ప్రాణాలు విడిచిపెట్టారు. అయితే దీనిపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టే పనిలో ఉంది విచారణ కమిటీ.
సంచలన నిజాలు వెలుగులోకి
సింహాచలం గోడ కూలిన ఘటనలో కాంట్రాక్టర్ లక్ష్మణ రావును విచారించిన కమిటీ సభ్యులు
సంచలన నిజాలు చెప్పిన లక్ష్మణరావు
చందనోత్సవానికి సమయం తక్కువ ఉంది, నేను గోడ కట్టనని చెప్పాను
దేవస్థానం, టూరిజం అధికారులు గోడ కట్టమని ఒత్తిడి చేశారు#SimhachalamTragedy pic.twitter.com/YKyALz3k76
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) May 1, 2025