Retro Collection: తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది బాగుందని చెప్తున్నారు, మరికొంతమంది ఇదేమి బోరింగ్ సినిమా రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు. కంగువ లాంటి డిజాస్టర్ టాక్ మాత్రం రాలేదు కానీ, ఓవరాల్ గా పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా నేడు నేషనల్ హాలిడే కావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రరపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ట్రమిళనాడు ప్రాంతం నుండి 15 కోట్ల గ్రాస్ వస్తుందని అంచనా. ఇది సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనొచ్చు.
Also Read: హిట్ 3 ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
గడిచిన పదేళ్ల నుండి సూర్య కి సరైన ఓపెనింగ్స్ వచ్చిన సినిమానే లేదు. ఈ చిత్రం ఓపెనింగ్స్ విషయం లో ఆ లోటు ని పూడ్చింది. బుక్ మై షో లో ఈ చిత్రానికి నేడు ఉదయం గంటకు 16 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం గంటకు పది వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒకప్పుడు సినిమాలకు ఫస్ట్ షోస్ సమయం లో భారీ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగేవి. కానీ ఈమధ్య కాలంలో ఫస్ట్ షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ బాగా తగ్గిపోయింది. ‘రెట్రో’ విషయం లో కూడా అదే జరిగింది. కానీ నేడు విడుదలైన ఇతర సినిమాలతో పోలిస్తే తక్కువ ఉంది. దీనిని చూసి అభిమానులు బయట టాక్ బాగలేదేమో అని భయపడుతున్నారు. ప్రస్తుతానికి గంటకు పది వేల టికెట్స్ సేల్ అవుతుంటే, అందులో కచ్చితంగా తెలుగు వెర్షన్ వి మూడు వేల టికెట్స్ ఉంటాయి.
తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గొప్పగా ఏమి జరగలేదు కానీ, సూర్య సినిమా కాబట్టి కచ్చితంగా కౌంటర్ బుకింగ్స్ బలంగానే జరుగుతూ ఉంటాయి. అలా పోల్చి చూస్తే ఈ చిత్రానికి ట్రెండ్ తగ్గుతూ పోతుంది అనే చెప్పాలి. ఈరోజు వరకు మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ, రేపటి నుండి ఈ చిత్రం నిలబడుతుందా లేదా అనేది అనుమానమే. ఓవరాల్ గా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 82 కోట్ల రూపాయలకు జరిగింది. ప్రస్తుతం సూర్య ఎదురుకుంటున్న వరుస ఫ్లాప్స్ కి ఇది చాలా పెద్ద బిజినెస్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు అంత రేంజ్ ఉందా లేదా అనేది రేపటితో తెలుస్తుంది.
Also Read: అవనీత్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిందే.