Ration Card Holders: గత కొన్ని నెలల నుంచి ప్రజలకు అందుబాటులో లేని ఈ నిత్యవసర వస్తువు కందిపప్పు ఈనెల జూన్ లో కూడా ప్రజలకు అందకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కందిపప్పు పంపిణీ పై ఇప్పటివరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ అవ్వలేదు.డీలర్లు గోదాముల నుండి డీడీలు తీసుకోకపోవడం వలన కందిపప్పు సరఫరా అన్ని రేషన్ షాపులలో పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చౌక ధర రేషన్ షాపులలో బియ్యంతో పాటు పంచదార మాత్రమే ప్రజలకు పంపిణీ జరుగుతుంది. ప్రజలు నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువులలో కందిపప్పు ప్రధానం. దీంతో ప్రస్తుతం రేషన్ దుకాణాలలో కందిపప్పు అందకపోవడంతో రేషన్ కార్డు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కందిపప్పు పంపిణీకి సంబంధించి అధికారులు వెంటనే స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. లేకపోతే ప్రజలు నెలల తరబడి నిత్యవసర వస్తువు కందిపప్పు దొరకకపోవడంతో వీటి కోసం ప్రైవేట్ మార్కెట్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
రేషన్ షాపులలో పంపిణీ చేస్తున్న వాటి గురించి డిఎస్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చౌకధర రేషన్ దుకాణాలలో బియ్యంతో పాటు పంచదార కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం జూన్ నెలలో కందిపప్పు పంపిణీ చేయలేదు అని ఆయన స్పష్టంగా తెలిపారు. త్వరలో రేషన్ కార్డు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో నెలనెలా కందిపప్పు సరఫరా జరిగే లాగా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో మాత్రమే మొత్తంగా 7.3 లక్షలకు పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఆ ప్రాంతంలో 1500 కు పైగా రేషన్ దుకాణాలు ఉన్నాయి.
ఈ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే నెల నెల 732 టన్నుల కందిపప్పు సరఫరా అవసరం అవుతుంది. జిల్లాలో రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో మెజారిటీగా పేద వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందుబాటులో ఉండడం చాలా అవసరం. మార్కెట్లో పెరిగిన ధరలకు కందిపప్పును కొనుగోలు చేసే ఆర్థిక పరిస్థితి వీళ్ళందరికీ లేకపోవడంతో వారందరూ పూర్తిగా చౌక ధర దుకాణాల మీద ఆధారపడి ఉన్నారని తెలుస్తుంది.