Chandrababu: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పక్షం తాము చేసిన సంక్షేమ పథకాలను చెబుతోంది. ఇలానే కొనసాగాలంటే మరోసారి వైసీపీ నే గెలిపించాలని జగన్ కోరుతున్నారు. ఇటువంటి తరుణంలో విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. జగన్కు మించి తాము సంక్షేమాన్ని అమలు చేస్తామని, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పాలి. కానీ ఆ పని చేయడం లేదు. కేవలం వివేకానంద రెడ్డి హత్య చుట్టూ రాజకీయం చేస్తుండడం విశేషం. ముఖ్యంగా షర్మిల, సునీతలు వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే వారి వెనుక చంద్రబాబు ఉన్నారన్నది జగన్ అనుమానం.వివేక హత్య పరిణామాలు వైసిపికి నష్టం చేకూరుస్తాయని భావించి కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో వివేకా హత్య విషయం మాట్లాడొద్దని కడప కోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం.
గత ఎన్నికలకు ముందు వివేక హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన వైసీపీకి సానుభూతి తెచ్చింది. Ewఎన్నికల్లో మాత్రం అదే ప్రతికూలత చూపుతోంది. వీలైనంతవరకు కుటుంబంలోనే చీలిక తెచ్చి.. జగన్ కు దారుణంగా దెబ్బతీయాలని చంద్రబాబు భావించారు. అటువంటి సమయంలోనే షర్మిల ఆయనకు ఒక అస్త్రంగా మారారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం, పీసీసీ పగ్గాలు తీసుకోవడం, జగన్ ను టార్గెట్ చేయడం, కడప లోక్సభ స్థానానికి పోటీ చేయడం, వివేక హత్య కేసును పదేపదే ప్రస్తావిస్తుండడం.. తదితర కారణాలు వైసీపీలో కలవరపాటుకు కారణం అవుతున్నాయి. అందుకే వివేక హత్య ప్రస్తావన లేకుండా చూడాలని కొందరు కడప కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు చంద్రబాబు, పవన్, షర్మిల, సునీతలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇకనుంచి వివేక హత్య అంశాన్ని మాట్లాడొద్దని సూచించింది.
అయితే ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారారు. అవినాష్ రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ కొనసాగుతుండగానే కడప కోర్టు మాత్రం త్వరగా స్పందించింది. అయితే ఈ కీలక ఆదేశాల నేపథ్యంలో వివేక ప్రస్తావన లేకుండా ఎన్నికల ప్రచారం చేయాల్సి వస్తోంది. అయితే వివేక హత్య అంశంతోనే కడప తో పాటు పులివెందులలో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు భావించారు. అందుకే ప్రతి ఎన్నికల సభలోను చంద్రబాబు వివేక హత్య అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు కోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడంతో చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.