Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: అన్నంటే ప్రేమ లేదు.. చంద్రబాబును ప్రశ్నించనూ లేదు.. ఒకే ఒక్క ట్విట్...

YS Sharmila: అన్నంటే ప్రేమ లేదు.. చంద్రబాబును ప్రశ్నించనూ లేదు.. ఒకే ఒక్క ట్విట్ తో జగన్ ను ఇరుకున పెట్టిన షర్మిల

Ys sharmila : జగన్ కు దారుణ పరాజయం ఎదురై అవమానపడుతున్నా సోదరి షర్మిల మనసు కరగడం లేదు. కనికరించడం లేదు. ప్రశ్నించాల్సిన చంద్రబాబును వెనుకేసుకొస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది.కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. సీనియర్లు అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. అసలు పార్టీకి భవిష్యత్తు ఉందా?లేదా?అన్న అనుమానంతో ఎక్కువమంది ఉన్నారు.జగన్ మాత్రం 2029 నాటికి పార్టీకి పూర్వ వైభవం ఖాయమని..పార్టీ శ్రేణులు యాక్టివ్ కావాలని పిలుపునిస్తున్నారు.పార్టీలో కొత్త నియామకాలు చేపడుతున్నారు.పోరాటానికి దిశా నిర్దేశం చేస్తున్నారు.అయితే ఇప్పటికే ఓడిపోయిన వైసీపీని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విడిచిపెట్టడం లేదు.ఇంకా ఆ పార్టీ పైన,నాటి ప్రభుత్వ విధానాలపైన విమర్శలు చేస్తూనే ఉన్నారు.పైకి లేచి యాక్టివ్ అవుతామన్న వైసీపీ శ్రేణులకు డిఫెన్స్ లో పెడుతున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జగన్ ప్రశ్నిస్తుంటే… నాటి జగన్ ప్రభుత్వ తప్పిదాలను గుర్తుచేస్తూ మరీ షర్మిల విమర్శలు చేస్తుండడం విశేషం. తాజాగా విశాఖ ఫార్మా కంపెనీలో ప్రమాదం పై.. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు జగన్. కానీ నాడు ఎల్జి పాలిమర్స్ ఘటన సమయంలో జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు షర్మిల. దీంతో జగన్ తో పాటు వైసిపి ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

* బాధితులను పరామర్శించిన జగన్
నిన్న అచ్యుతాపురం ఫార్మా మృతుల కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు జగన్. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది గత ప్రభుత్వ వైఫల్యమైన అని ఆరోపించారు. ఎల్జి పాలిమర్స్ ప్రమాదం నుంచి కూడా ఏమీ నేర్చుకోకుండా పట్టనట్టు వ్యవహరించారని.. ప్యాలెస్ కొట్టుకోవడానికి డబ్బులు, తీరిక ఉంటాయి కానీ.. కార్మికుల ప్రాణాలు పట్టించుకోలేదని నాటి వైసిపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

* ఎన్నో ప్రశ్నలు
అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి ఘటనలు జరిగి ఉండేవి కావని షర్మిల చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ అచ్యుతాపురం మృత్యు ఘోషకు, దారుణ ఘటనకు బాధ్యులు, అటు లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలు, వారితో కలిసిపోయి జనాల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వాలు, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? బాధిత కుటుంబాల కన్నీళ్లు ఆగుతాయా? గత ఏడాది చివరిలోనే ఎసన్సియా ఫార్మా నిర్వాకాలను ఓ రిపోర్టు బయట పెట్టిందని.. ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. కానీ అప్పటి సర్కార్, ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన నుంచి ఏమీ నేర్చుకోకుండా, ఆ రిపోర్ట్ పై మౌనం వహించింది. పట్టుమని పాతిక కిలోమీటర్ల దూరంలో కొండని పిండి చేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బు, తీరిక ఉంటాయి. కానీ కార్మికుల ప్రాణాలంటే మాత్రం లెక్కలేదు’ వన్ టు షర్మిల ట్వీట్ చేశారు.

* షర్మిల సడన్ ఎంట్రీ
అయితే జగన్ ఇలా బాధితులను పరామర్శించారో లేదో.. షర్మిల ఎంటర్ అయ్యారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని జగన్ భావించారు. కానీ ఈ క్రమంలో షర్మిల లేవనెత్తిన అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. జగన్ సర్కార్ వైఫల్యం కారణంగానే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని షర్మిల చెప్పుకు రావడం మైనస్ గా మారుతుంది. మొత్తానికి అయితే జగన్ నీడలా వెంటాడుతున్నారు షర్మిల.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular