https://oktelugu.com/

YS Sharmila: షర్మిల టార్గెట్ అదే..

ఇప్పటికే సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోజుకో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో పర్యటించిన జగన్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించారు.

Written By: , Updated On : April 5, 2024 / 11:24 AM IST
Sharmila targets Avinash Reddy

Sharmila targets Avinash Reddy

Follow us on

YS Sharmila: ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారపర్వంలోకి అడుగుపెట్టాయి. అధికార వైసిపి ఒంటరి పోరు చేస్తోంది. టిడిపి, బిజెపి, జనసేన కూటమి కట్టాయి. వైసీపీ వర్సెస్ కూటమి అన్న పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. వామపక్షాలతో కలిసి మహా కూటమి పోటీ చేయనుంది. గత రెండు ఎన్నికల్లో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. ఊపిరి పోయాలని షర్మిల భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ప్రచార పర్వంలోకి అడుగుపెట్టారు. ఈరోజు నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. అంతకంటే ముందు తల్లి విజయమ్మ ఆశీర్వాదం అందుకున్నారు.

ఇప్పటికే సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోజుకో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో పర్యటించిన జగన్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించారు. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకునే.. జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాబాయి వివేకాను ఎవరు చంపారో? ఎవరు చంపించారో? ఈ జిల్లా ప్రజలకు, దేవుడికి తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివేక కుమార్తె సునీత స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో విపక్ష నేతలు సైతం జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. అయితే ఆది నుంచి వివేక హత్య కేసు విషయంలో.. షర్మిల గట్టిగానే మాట్లాడుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎన్నికల ప్రచారంలోకి దిగడంతో.. కచ్చితంగా వివేక హత్య కేసు గురించి తప్పకుండా ప్రస్తావిస్తారు. తనను కడప ఎంపీగా చేయాలని బాబాయ్ వివేక భావించారని.. అందుకే ఆయన హత్యకు గురయ్యారని షర్మిల ఇప్పటికే వ్యాఖ్యానించారు. అంటే ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసును తప్పకుండా అజెండాగా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

షర్మిల ప్రత్యర్థిగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అవినాష్ రెడ్డి ఉన్నారు. కడపలో ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిసినా జగన్ మొండిగా అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు టిడిపి భూపేష్ రెడ్డిని బరిలో దించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భూపేష్ రెడ్డి జమ్మలమడుగు టిడిపి అభ్యర్థిగా, కడప ఎంపీగా బిజెపి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో వివేకా హత్య కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. వైయస్ కుటుంబం ముప్పేట ఆదినారాయణ రెడ్డి పై ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు అదే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తుండడం.. వివేకను హత్య చేసింది ఆ కుటుంబ సభ్యులేనని సిబిఐ చెబుతుండడం.. షర్మిల సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఆదినారాయణ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం చూపగలనని.. ఓట్ల చీలికతో కడప ఎంపీ సీటును గెలుపొందుతానని ధీమాతో ఉన్నారు. అయితే షర్మిల మాత్రం వివేకా హత్యకేసు అంశాన్ని ప్రస్తావించి కడప జిల్లా ప్రజల మనసు దోచుకోవాలని చూస్తున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డిని గెలిపించి.. కడప ప్రజలు వివేకను హత్య చేశామన్న ఆరోపణను నమ్మలేదని నిరూపించడానికి ముందుగా ముందుకు సాగుతున్నారు. అయితే కడపలో ఎవరు విక్టరీ కొడతారో? ఎవరు విజేతగా నిలుస్తారో? చూడాలి.