https://oktelugu.com/

AP Politics : *ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి పై సీరియస్.. వైసిపి ఫిర్యాదు పై నోటీసులు జారీ!*

AP Politics : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు డీజీపీకి నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది.

Written By: , Updated On : February 22, 2025 / 10:34 AM IST
DGP

DGP

Follow us on

AP Politics : ఏపీలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో( Municipal bipole ) జరిగిన విధ్వంసాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. దీనిపై నివేదిక కోరింది. ఏపీ సీఎస్ విజయానంద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో సంభవించిన ఘర్షణలపై స్పందించింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల పై కూటమి నేతలు దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 3న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు బస్సు పై వెళ్తుండగా టిడిపి కూటమి నేతలు ఆపి.. దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సు కిటికీల అద్దాలను పగులు కొట్టారని… ముందుకు కదలకుండా టైర్ల లోని గాలి తీసేసారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి ఆరోపించారు. దీనిపై వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతల తీరును, వారికి అండగా నిలుస్తున్న పోలీసుల తీరును ఆక్షేపించారు.

* టిడిపికి బలం లేకపోయినా
వాస్తవానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో( Tirupati Municipal Corporation) తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ గెలుచుకునే బలం లేదు. అయితే టిడిపికి చెందిన మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం వెనుక కూటమి విధ్వంసం ఉందని ఆరోపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రధాన నిందితుల పేర్లతో తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అయితే ప్రధాన నిందితుల పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ రాసినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై ఈనెల 14న తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎన్ హెచ్ఆర్సిని ఆశ్రయించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే ఏపీ పోలీసులు పట్టించుకోని వైనాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

* వారం రోజుల్లో నివేదికకు ఆదేశం
దీనిపై తాజాగా స్పందించింది జాతీయ మానవ హక్కుల కమిషన్( NHRC ). ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపిని ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. దీంతో జాతీయస్థాయిలో ఇది చర్చకు దారితీసింది. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విధ్వంసాలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మానవహక్కుల కమిషన్ స్పందించడం విశేషం.