https://oktelugu.com/

Pawankalyan Varahi Yatra : జనమా.. జన సైనికుల వనమా.. వారాహి యాత్రకు నీరా‘జనం’!

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి జూన్‌ 14న బుధవారం యాత్ర ప్రారంభించారు. అంతకుముందు సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 15, 2023 3:05 pm
    Follow us on

    Pawankalyan Varahi Yatra : ఆంధ్రప్రదేశ్‌కు వైసీపీ పాలన నుంచి విముక్తి కల్పించాలన్న సకల్పంతో ప్రతీ అడుగూ వ్యూహాత్మకంగా వేస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. వారాహియాత్రకు శ్రీకారం చుట్టారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి జూన్‌ 14న బుధవారం యాత్ర ప్రారంభించారు. అంతకుముందు సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహించారు.

    అడుగడుగునా ఘన స్వాగతం..
    అన్నవరం నుంచి కత్తిపూడి వరకు పవన్‌ కళ్యాణ్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పవన్‌ యాత్ర సుగుతున్న రోడ్లకు ఇరువైపులా జన సైనికులు, ప్రజలు నిరాజనాలు పలికారు. దారిపొడవునా జై జనసేన.. జై పవన్‌ కళ్యాణ్‌ నినాదాలు మారుమోగాయి. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అందరికీ అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగారు. దీంతో రహదారికి ఇరువైపులా జనసేన జెండాలు, జనమే కనిపించారు.

    పోటెత్తిన ‘జన’ కెరటం..
    అన్నవరం నుంచి కత్తిపూడి వరకు రహదారికి ఇరువైపులా సాగిన జన ప్రవాహం.. కత్తిపూడిలో సభా ప్రాంగణంలో జన కెరటమై పోటెత్తింది. పవన్‌ వారాహియాత్ర తొలి సభకు భారీగా తరలివచ్చిన జనం, జనసైనికులతో కత్తిపూడి కిటకిటలాడింది. అభిమానులు, జనం, జన సైనికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్‌ కళ్యాణ్‌.

    కరవాలం పట్టి.. ఉత్సాహం నింపి..
    ఇక కత్తిపూడి సభలో పవన్‌ కళ్యాణ్‌కు అభిమానులు కరావలం(కత్తి) బహూకరించారు. వారాహి వాహనంపై నిలబడిన జనసేనాని దానిని తిప్పుతు అభిమానుల్లో ఉత్సాహం నింపారు. పవన్‌ కత్తి పట్టగానే సభా ప్రాంగణం సీఎం.. సీఎం అనే నినాదాలతో హోరెత్తింది.

    ‘కత్తి’లాంటి పంచులు..
    ఇక కత్తిపూడి సభలో జనసేనాని ప్రసంగం ఆసాంతం అందరినీ ఆకట్టుకుంది. కత్తిలాంటి పంచుంలతో వైసీపీ పాలనను ఎండగట్టారు. జగన్‌ పేరు ఎత్తకుండా పెద్దమనిషి అంటూ తనపై సీఎం చేసిన ప్రతీ ఆరోపణకు బదులిచ్చారు. దీంతో సభాప్రాంగణం, కత్తిపూడి వీధులన్నీ జనసేన నినాధాలతో మార్మోగాయి. తొలిసభకే జనం కెరటంలా పోటెత్తడంతో జనసేన నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పది రోజులపాటు రెండు ఉమ్మడి జిల్లాల్లో సాగే యాత్ర, నిర్వహించే పది సభలను మరింత ఉత్సాహంతో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.