SC ST Act Misuse Kommineni Controversy: సుప్రీంకోర్టు ఏ ముహూర్తాన అయితే తీర్పు ఇచ్చిందో.. ఈ ఏడుపదుల వయసులో చాలు రా నాయన అనుకుంటూ శ్రీనివాసరావు అలియాస్ కొమ్మినేని బయటపడ్డారు.. పాత పార్టీకి కాపు కాస్తే.. దానికి కొంతకాలం నుంచి శత్రువు అయిపోయారు. ఇప్పుడు నమ్ముకున్న పార్టీ మౌత్ పీస్ లాంటి ఛానల్ లో పనిచేస్తుంటే.. కాపాడే శక్తి లేకుండా పోయింది. చివరికి సుప్రీంకోర్టు అభయం ఇచ్చింది. బయటపడే మార్గాన్ని చూపించింది. మొత్తానికి బయట పడేసింది. ఈ మొత్తం పరిణామంలో కొమ్మినేని చాలా నేర్చుకోవాలి. అన్నింటికీ మించి చాలా తెలుసుకోవాలి.. లేకపోతే చంద్రబాబుకు ఉన్న ప్రచార బలం ముందు అన్ని మూసుకోవాల్సి వస్తుంది. కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయనకు అన్ని కాకపోయినా చాలావరకు గుర్తుకే ఉంటాయి.. అలాంటి ఓ సంఘటన 1995 లో జరిగింది. అప్పటికి కొమ్మినేని మీడియా ఫీల్డ్ లో ఉండే ఉంటారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ను గద్దె నుంచి.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకెళ్లారు. అసలే పెద్దాయనకి కోపం ఎక్కువ. పైగా అప్పట్లో పరిణామాలు ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. దీంతో చంద్రబాబు చేస్తున్న పని నచ్చక సీనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. తన పార్టీని ముక్కలు చేసి.. తన పీఠం నుంచి దించి.. ఎమ్మెల్యేలను తీసుకెళ్లడాన్ని సీనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు చంద్రబాబు చేసింది రాజకీయ వ్య**** అని తిట్టి పోశారు.
Also Read: Junior NTR : మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్.. తెర వెనుక జరిగింది అదే!
కాగలకార్యం
నాడు సీనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయిలో తిట్టినప్పటికీ చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అంతేకాదు ఎప్పుడైతే తనను ఉద్దేశించి వ్య***** అని తిట్టారో అప్పుడే చంద్రబాబు ప్రచార పర్వం మొదలైంది. నాటి రోజుల్లో చంద్రబాబు టీడీపీకి మాత్రమే ఒక బలమైన మీడియా ఉండేది. దీంతో సీనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆ మీడియాలో వార్తలు వచ్చాయి. మహిళలను సీనియర్ ఎన్టీఆర్ కించపరచారని ఆ వార్తల సారాంశం. వాస్తవానికి నాటి చంద్రబాబు టీడీపీలో ఉన్న మహిళలు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సీనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు ఆందోళన చేస్తామని ప్రకటించారు. ఈ పరిణయంతో సీనియర్ ఎన్టీఆర్ ఒకసారి గా దిగ్బ్రాంతి చెందారు. చంద్రబాబు టిడిపి లో ఉన్న మహిళలు సీనియర్ ఎన్టీఆర్ ఇంటి ఎదుట ధర్నా చేయలేకపోయినప్పటికీ.. మహిళలను వ్య**** అంటారా అంటూ బాబు బృందం సీనియర్ ఎన్టీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
Also Read: Kommineni Srinivasa Rao Bail: నవ్వితే అరెస్ట్ చేస్తారా? కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీం ఆదేశం
కొమ్మినేనికి అర్థమైందనుకుంటా
టిడిపిని పెంచి.. పోషించి.. కాంగ్రెస్ పార్టీ నుంచి 9 నెలల్లో అధికారాన్ని దక్కించుకొని రికార్డు సృష్టించిన సీనియర్ ఎన్టీఆర్ కే “బాబు” ప్రచార సామర్థ్యం దెబ్బ తప్పలేదు. ఆఫ్ట్రాల్ కొమ్మినేని ఎంత.. బహుశా కొద్ది రోజులు జైల్లో ఉన్న ఆయనకు నాడు సీనియర్ ఎన్టీఆర్ కు జరిగిన పరిణామం.. చంద్రబాబు వల్ల ఎదురైన పరాభవం గుర్తుకు వచ్చిందనుకుంటా.. అంతేకాదు టిడిపి ప్రచార సామర్థ్యం చూసిన తర్వాత కొమ్మినేనికి తత్వం బోధపడిందనుకుంటా.. ఈ మొత్తం పరిణామంలో కొమ్మినేని కి జగన్ అండగా ఉండకపోవచ్చు. ఆయన పార్టీ నాయకులు దన్నుగా నిలబడి ఉండకపోవచ్చు. అంతిమంగా సుప్రీంకోర్టు మాత్రమే ఆయనకు రక్షణ కవచం అందించింది.. జైలు నుంచి విడుదలయ్యేలా చేసింది.