Sharmila And Kavitha: తెలుగు రాష్ట్రాల్లో పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ వస్తున్నాయి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ, బిఆర్ఎస్ పార్టీలు. వాటి మధ్య ఉన్న మిత్ర బంధం ఎంత గట్టిదో తెలియజేయనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఇట్టే తెలుసు. అయితే యాదృచ్ఛికమో.. వరమో తెలియదు కానీ.. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి.. తెలంగాణలో కేటీఆర్ కు ఇంటి పోరు ఉంది. చెల్లెలు ఆ పోరును కొనసాగిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై షర్మిల పోరు, బిఆర్ఎస్ పై కవిత ఫైర్.. ఆ రెండు పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే సోదరి షర్మిల… తెలంగాణలో అధికారం నుంచి దూరం కాగానే కవిత అన్నలపై పోరుబాట పట్టారు. అది కూడా వారికి గిట్టని మీడియా నుంచి రావడం గమనార్హం.
* వ్యతిరేక మీడియా ద్వారా బాణాలు..
జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించేది ఎల్లో మీడియా. అలా పిలవబడే ఈనాడు( Eenadu), ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ. అయితే ఇందులో ఏబీఎన్‌తో షర్మిల తన తొలి బాణం జగన్ పై సంధించారు. టీవీ5 తో కవిత బిఆర్ఎస్ పై పోరుబాట మొదలుపెట్టారు. షర్మిల ఎక్కి పెడుతున్న బాణాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాలకేయ సోషల్ మీడియా ఉంది. ఆపై సాక్షి న్యూస్ ఛానల్ ఎలానూ ఉంది. తెలంగాణలో కవిత నుంచి వచ్చే విమర్శలు ఎదుర్కోవడానికి కేటీఆర్ సోషల్ మీడియా సైన్యానికి తోడు బిఆర్ఎస్ గొంతుకగా ఉండే టీ న్యూస్ అడ్డంగా నిలబడుతోంది. ఇటీవల కవితపై టీ న్యూస్ లో వ్యతిరేక కథనాలు పెరగడంతో ఆమె స్పందించారు. యాజమాన్యానికి లీగల్ నోటీసులు జారీ చేశారు.
* సాక్షిలో వ్యతిరేక కథనాలు..
జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు షర్మిల( Sharmila). అప్పుడు సాక్షి మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే మాత్రం కవిత మాదిరిగా స్పందించాలి. అసలు మహానేత రాజశేఖరరెడ్డి కె ఆమె పుట్టారా అని అనుమానం వ్యక్తం చేసేలా సాక్షిలో కథనాలు వచ్చాయి. విజయమ్మ ఆత్మగౌరవాన్ని సైతం కించపరిచేలా ఆ ఛానల్లో విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు కవిత మాదిరిగా అప్పుడు షర్మిల స్పందించలేదు. పైగా ఇందిరా మీడియా గా పిలిచే సాక్షిలో తనకు వాటాలు ఉన్నాయని షర్మిల చెబుతున్నారు. అంటే ఆమె సొంత మీడియాలోనే ఆమెకు వ్యతిరేక కథనాలు వస్తున్నాయన్నమాట.