Samantha: నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో విడాకులు తర్వాత చాలా కాలం వరకు సింగిల్ లైఫ్ ని గడుపుతూ వచ్చిన సమంత(Samantha Ruth Prabhu), కొన్నాళ్ళకు రాజ్ నిడిమోరు అనే బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడపడం, రీసెంట్ గానే అతన్ని ఒక గుడిలో పెళ్లాడడం వంటివి జరిగింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కాలక్రమేణా ఆ స్నేహం కాస్త ప్రేమ గా మారడం, అది పెళ్లి వరకు దారి తియ్యడం జరిగింది. అయితే నాగ చైతన్య ని పెళ్లి చేయూస్కున్న వెంటనే ‘సమంత అక్కినేని’ గా పేరు మార్చుకున్న సమంత, ఇప్పుడు ఎందుకు మార్చుకోలేదు?, అంటే అలా పేరు మార్చుకోవడం ఈమెకు కలిసి రాలేదు కాబట్టి, ఇక మీదట అలాంటివి రిపీట్ చేయకూడదు అని అనుకుందా?, అసలు కారణం ఏంటి అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.
అయితే ప్రస్తుతం ఆమె నందిని రెడ్డి దర్శకత్వం లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం చేస్తోంది. ఈ సినిమాలో టైటిల్స్ పాడేటప్పుడు ‘సమంత నిడిమోరు’ అని పడుతుందట. ఆ సినిమా విడుదల తర్వాతే ఆమె సోషల్ మీడియా లో కూడా తన పేరు ని మార్చుకుంటుంది అట. ఇది అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ గా ఉండబోతుంది. సమంత క్రిస్టియన్ మతస్తురాలు అయినప్పటికీ, హిందూ దేవుళ్లను చాలా గట్టిగా నమ్ముతుంది. ఆమెకంటూ కొన్ని బలమైన సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంట్ కి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క సమంత ఏమి చేసిన విమర్శించే వాళ్ళు, ఈ అంశం పై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఆమె అభిమానులు సమంత తీసుకున్న ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సమంత వెండితెర పై హీరోయిన్ గా కనిపించి చాలా రోజులే అయ్యింది. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం లోనే ఆమె చివరి సారిగా హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా విడుదలై మూడేళ్లు కావొస్తుంది. రీసెంట్ గానే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించి ‘శుభమ్’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నందిని రెడ్డి తో ఆమె చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కూడా సమంత నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక మీదట రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుందట సమంత. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, అప్పుడప్పుడు ఛాన్స్ దొరికితే విలన్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా సిద్దమేనట సమంత. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో ఆమె చేసిన విలన్ రోల్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము, భవిష్యత్తులో కూడా అలాంటి రోల్స్ చేయడానికి రెడీ అట సమంత.