Sai Krishna And Naveen Reddy: సాయి కృష్ణలంక పోలీసులు ఎందుకు పట్టుకున్నారు.. అతడిని లాకప్ లో ఎందుకు వేశారు.. ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళ్లిపోయాడు.. సీఐ రాజశేఖర్ అతడి విషయంలో ఎందుకు అంత సీరియస్ అయ్యారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ పోలీసు వర్గాల నుంచి మొదలుపెడితే సామాన్యుల వరకు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఏపీ రాజకీయాలను తీవ్రస్థాయిలో కుదుపునకు గురిచేస్తున్నాయి.
సాయి కృష్ణ వ్యవహారాన్ని ముందుగా తెరపైకి తీసుకువచ్చింది ఏపీ మాజీమంత్రి రాంబాబు. సాయి కృష్ణ చనిపోయాడని చెప్పి.. నవీన్ రెడ్డి ఫోటో చూపించాడు. మొదట్లో మీడియా అంతగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా వైసీపీ అనుకూల మీడియా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ప్రచారం చేసింది. చివరికి రాంబాబు చూపించింది నవీన్ రెడ్డి ఫోటో అని తెలియడంతో సాక్షి మీడియా సైలెంట్ అయిపోయింది. అయితే నవీన్ రెడ్డి ఫోటో రాంబాబు చేతికి ఎలా వచ్చింది.. నవీన్ రెడ్డికి, సాయి కృష్ణకు ఏంటి సంబంధం… నవీన్ రెడ్డి శరీరం మీద ఆ గాయాలు ఎందుకు ఉన్నాయి.. అతడు అలా అచేతనంగా ఎందుకు పడి ఉన్నాడు.. ఈ ప్రశ్నలు వెలుగులోకి వచ్చిన తర్వాత సమాధానాలు కూడా అదే స్థాయిలో వ్యక్తమయ్యాయి.
సాక్షి మీడియా సాయికృష్ణ ఆగడాల గురించి ఒక వార్త కూడా రాలేదు. నవీన్ రెడ్డి మరణం గురించి కూడా ప్రస్తావించలేదు. ఇక్కడ సాయి కృష్ణ అనే వాడు రౌడీషీటర్. సాయి కృష్ణ, నవీన్ రెడ్డికి జైల్లో పరిచయం ఏర్పడింది. నవీన్ రెడ్డి మీద భవానిపురం పోలీస్ స్టేషన్లో క్రైమ్ సస్పెక్ట్ షీట్ ఉంది. వీరిద్దరికి జైల్లో పరిచయం బయట కూడా కొనసాగింది. వీరిద్దరూ జైలు నుంచి విడుదలైన తర్వాత తమ స్నేహాన్ని కొనసాగించారు.
గత ఏడాది డిసెంబర్ 4న సాయి కృష్ణ, నవీన్ రెడ్డి.. ఇంకా కొంతమంది కలిసి జగ్గయ్యపేట మండలం ధర్మవరపు తండా సమీపంలో మద్యం తాగారు. అక్కడ విందు కూడా చేసుకున్నారు. సాయి కృష్ణ, నవీన్ మధ్య ఫోన్ కు సంబంధించి చిన్నపాటి చర్చ మొదలైంది. అది కాస్త గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలో నవీన్ ను సాయి కృష్ణ చెంప మీద కొట్టాడు. దీంతో నవీన్ రెడ్డి ఒక కర్రతో పిల్ల సాయిని గట్టిగా కొట్టాడు. సాయి కృష్ణ కోపం ఆపుకోలేక చేతిలో ఉన్న బీరు సీసాను పగలగొట్టాడు. ఆ తర్వాత నవీన్ ను దారుణంగా పొడిచాడు. నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే నవీన్ రెడ్డి చనిపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా.. నవీన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి ఆవరణలో పడేసి వెళ్లిపోయాడు.
ఈ వ్యవహారంలో సాయి కృష్ణ మీద పోలీసులకు మొదటి నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. అనేక కేసులు సాయి కృష్ణ మీద నమోదు కావడంతో పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించడం మొదలుపెట్టారు.. అంబటి రాంబాబు చూపించిన ఫోటో సాయి కృష్ణది కాదు. అది నవీన్ రెడ్డిది. ప్రచారం కోసం వైసీపీ నేతలు దిగజారి తప్పుడు ఫోటోలు చూపించారు. చివరికి రౌడీ షీటర్లను పరామర్శించి.. తమ పార్టీ పేరును సార్ధకం చేసుకున్నారని టిడిపి నేతలు అంటున్నారు.
